జగనన్న విద్యా దీవెన- పేద విద్యార్థులకు ఒక వరం
నెల్లూరు ముచ్చట్లు:
కోవూరు మండల పరిషత్ కార్యాలయం నందు జగనన్న విద్యా దీవెన జూలై- సెప్టెంబర్ 2022 త్రైమాసిక నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు మండల జడ్పిటిసి సభ్యురాలు కవరగిరి శ్రీలత మాట్లాడుతూ జగనన్న విద్య దీవెన పథకం పేద విద్యార్థులకు వరం లాంటిదని తెలిపినారు.ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదవాలనే ఆశయంతో జగనన్న విద్యా దీవెన పథకం ప్రవేశపెట్టారని, క్రమం తప్పకుండా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసి వారి అభ్యున్నతికి పాటుపడుతున్నారని తెలియజేసినారు.కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు విద్యాలయాల పట్ల, విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత చదువులు అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరినారు. పై కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యు మనోజ్ కుమార్ ,మండల ఉపాధ్యక్షులు శివుని నరసింహులు రెడ్డి, పడుగు పాడు పిఎఏసి చైర్మన్ రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, మండల ఏ ఏ బి చైర్మన్ నీలపు రెడ్డి హరి ప్రసాద్ రెడ్డి, కోవూరు సర్పంచ్ యాకసిరి విజయ, ఎంపీటీసీ సభ్యులు వేణు, బాబు రావు , పుచ్చలపల్లి శ్రీనివాసులు రెడ్డి, తుపాకుల సుప్రజ , చింత కళ్యాణి, రాజేశ్వరి,విద్యార్థుల తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Tags; Jagannana Vidya Devena- A boon for poor students
