Jagannanna blessed the future of the students

విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని జగనన్న దీవెన

-6,927 మందికి లబ్ధి
– పెద్దిరెడ్డి

Date:24/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

ఉన్నత చదువులు చదువుకోవాలనుకునే పేద విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలనే ఆలోచనతో జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టారని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తెలిపారు. సోమవారం పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన 6,927మంది లబ్ధిదారులతో సమావేశాన్ని కమిషనర్‌ కెఎల్‌.వర్మ , ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా బీసీ వెల్ఫేర్‌ కార్పోరేషన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, కొండవీటి నాగభూషణం, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ అమరేంద్ర ముఖ్యఅతిధులుగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా జగనన్న వసతి దీవె న కార్డులను విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పంపిణీ చేశారు. పుంగనూరు పట్టణంలో 882 మందికి, మండలంలో 1465 , చౌడేపల్లె 977, సోమల 991, సదుం 938 , పులిచెర్ల 986 , రొంపిచెర్ల 688 మందికి అందజేసినట్లు తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పుంగనూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కొండవీటి నాగభూషణం మాట్లాడుతూ గత ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేయడంతో వ్యవస్థ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందన్నారు. దీనిని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ ప్రతి విద్యార్థి చదువుకునేందుకు ఆర్థిక సహాయం అందిస్తున్నారని కొనియాడారు. అక్కిసాని భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు , వారి తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి భరోసా కల్పించారన్నారు. అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టి రూ.15 వేలు ఆర్థిక సహాయం అందజేయడం, ప్రస్తుతం ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు రూ.20 వేలు వరకు ఆర్థిక సహాయం అందించడం హర్షనీయమన్నారు. దేశ చరిత్రలో విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజల కష్టాలను తీర్చేందుకు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైందని కొనియాడారు. ప్రజలు తమ సమస్యలను సచివాలయంలో పరిష్కరించుకునేందుకు ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నరసింహులు, మాజీ వైస్‌ ఎంపీపీ రామచంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్లు రేష్మా, మనోహర్‌, మాజీ కోఆప్షన్‌ మెంబర్‌ ఖాదర్‌బాషా, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యదర్శి దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఏఎస్‌డబ్యూజ్లివో వెంకటస్వామితో పాటు వార్డెన్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పెండింగ్ భూసమస్యల పరిష్కారానికి కృషి

Tags: Jagannanna blessed the future of the students

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *