Jagannanna blessing fund in Punganur

పుంగనూరులో జగనన్న దీవెన నిధులు అధికారుల జేబుల్లోకి

– అక్రమాలకు అడ్డాగా మున్సిపాలిటి
– లక్షలాది రూపాయలు స్వాహా ..?
– పట్టించుకోని అధికారులు

Date:02/06/2020

పుంగనూరు ముచ్చట్లు:

పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు తొలిసారిగా వైఎస్‌ఆర్‌సీపీ అధినేత , ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.20 వేల రూపాయలు చొప్పున నేరుగా ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఆసరగా చేసుకున్న వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్‌ ఉద్యోగులు కొంత మంది కలసి జగనన్న దీవెన పథకంలో బోగస్‌ ఖాతాలను సృష్టించి, ప్రభుత్వ నిధులు సొంత ఖాతాల్లోకి జమ చేసుకున్నట్లు పుంగనూరులో చర్చ సాగుతోంది. ఈ పథకం క్రింద మూడు సచివాలయ కేంద్రాలలో 31 మంది విద్యార్థుల పేరుతో బోగస్‌ ఖాతాలను నమోదు చేసి, డబ్బులు స్వాహా పర్వానికి శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. అలాగే పెన్షన్లు, దీర్ఘకాలిక వ్యాది గ్రస్తులకు అందజేసే రూ.10 వే ల రూపాయలు కూడ స్వాహా చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై మున్సిపల్‌ అధికారులు దర్యాప్తు చేపట్టకుండ డబ్బులు స్వాహా చేసిన వారి వద్ద నుంచి కొంత సొమ్ము వసూలు చేశారు. మిగిలిన డబ్బు కట్టకపోవడంతో లబ్ధిదారులు ప్రతి రోజు మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చి ఘర్షణలు పడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా మున్సిపాలిటిలో అధికారుల పనితీరు రోజురోజుకు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దీనిని ఆసరగా చేసుకున్న కొంత మంది వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ వెంటనే చర్యలు తీసుకుని మున్సిపాలిటిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సమగ్ర విచారణ చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Jagannanna blessing fund in Punganur
Jagannanna blessing fund in Punganur

రాజధానిలో డేంజర్ బెల్స్.

Tags: Jagannanna blessing fund in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *