చరిత్రలో నిలిచేలా జగనన్నకాలనీలు ఏర్పాటు- మంత్రి పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

 

చరిత్రలో నిలిచిపోయేలా జగనన్నకాలనీలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఎంపిలు మిధున్‌రెడ్డి, రెడ్డెప్ప, కలెక్టర్‌ హరినారాయణ్‌ , సబ్‌కలెక్టర్‌ జాహ్నవి తో కలసి జగనన్నకాలనీలో గృహనిర్మాణ పనులను పూజలు చేసి, మొ క్కలు నాటి , పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మ్యానిఫెస్టోలో పేర్కొన్న మేరకు 90 శాతం పైగా సంక్షేమ పథకాలు అమలు పరిచారన్నారు. నవరత్నాలలో భాగంగా జగనన్నకాలనీలో అన్నిమౌళిక వసతులు ఏర్పాటు చేసి, ఇండ్లు నిర్మిస్తున్నామన్నారు. అర్హులైన పేద లభ్ధిదారులందరికి ఇంటి పట్టాలు మంజూరు చేస్తామని తెలిపారు. జగనన్న కాలనీలలో లబ్ధిదారులకు కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను కొనుగోలు చేసి, మహిళలకు పట్టాలుగా ఇవ్వడం జరిగిందన్నారు. మహిళల పక్షపాతిగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వారి అభివృద్ధిని కాంక్షిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ కెఎల్‌.వర్మ, మాజీ జెడ్పివైస్‌ పెద్దిరెడ్డి ,చైర్మన్‌ అలీమ్‌బాషా, మాజీ చైర్మన్‌ నాగభూషణం, మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మాజీ చైర్మన్‌ నాగేంద్ర, ఏఎంసి చైర్మన్‌ నాగరాజారెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, కౌన్సిలర్లు అమ్ము, రేష్మా, కిజర్‌ఖాన్‌, మనోహర్‌, నటరాజ, కాళిదాసు, శ్రీనివాసులు, నరసింహులు, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Jagannannakalani established to stand in history – Minister Peddireddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *