జగనన్నను సీఎం చేసేదాక పోరాటం చేస్తాం

Jagannannan will struggle to make the CM

Jagannannan will struggle to make the CM

– చైర్‌పర్శన్‌ షమీమ్‌షరీఫ్‌

Date:26/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేదాక పోరాటం చేస్తామని మున్సిపల్‌ చైర్‌పర్శన్‌ షమీమ్‌షరీఫ్‌ తెలిపారు. సోమవారం పట్టణంలో మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, కౌన్సిలర్లు అమ్ము, ఇనాయతుల్లాషరీఫ్‌, ఆసిఫ్‌, ఇబ్రహిం, మనోహర్‌, నయాజ్‌, గంగులమ్మ, లీలావతమ్మ, లలిత, నాగసుబ్బమ్మ, దివ్యలక్ష్మి, రేష్మాతో కలసి నవరత్నాల కరపత్రాలను పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షమీమ్‌షరీఫ్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి సూచనల మేరకు నవరత్నాలపై చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలలో రైతు భరోస, ఆరోగ్యశ్రీ క్రింద రూ.1000 లు ఖర్చు దాటితే ప్రభుత్వంచే వైద్యసహాయం, 60 సంవత్సరాల వారికి పెన్షన్లు రూ.2 వేలకు పెంపు, వికలాంగులకు రూ.3 వేలు, పేదలందరికి పక్కాఇల్లు, అమ్మబడి క్రింద ప్రతి తల్లికి సంవత్సరాకి రూ.15 వేలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పాలనను తిరిగి రాష్ట్రంలో చూడాలంటే జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం ఎవరు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల హామిలను అమలుపరచకుండ , అధికారం రాగానే వాటిని విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు పేదలకు అందడం లేదని, తెలుగుదేశం పార్టీ వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోను అమలుచేయాలని డిమాండు చేశారు. ఎన్నికలు సమీపిస్తుంటే ప్రభుత్వం ప్రజలపైన , ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులపైన కపట ప్రేమ చూపుతోందన్నారు. ప్రజలు ఇలాంటి విధానాలను గమనించి తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి రావడం ఖాయమని ఆశాబావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి నేతలు జాకీర్‌, నిజామ్‌, ఇర్ఫాన్‌, అష్రఫ్‌, మోహసిన్‌, అస్లాం, షామ్‌, నయాజ్‌, అమ్ముకుట్టి, అన్సర్‌, నవాజ్‌, అంజాద్‌, అనీస్‌ తదితరులు పాల్గొన్నారు.

 

రాజ్యాంగం ప్రసాదించి హక్కులను కాపాడాలి

Tags: Jagannannan will struggle to make the CM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *