Natyam ad

పేదరికంలో ఏప్రాణం పోరాదనేదే జగనన్న ఆశయం

-వడిత్య శంకర్‌నాయక్‌

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

పేదరికంలో ఉన్న ప్రజలు ఆనారోగ్యం భారిన పడితే ఏప్రాణం కోల్పోరాదన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి కార్పోరేట్‌ వైద్యం అందిస్తున్నారని గిరిజన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వడిత్య శంకర్‌నాయక్‌ తెలిపారు. బుధవారం మండలంలోని గిరిజనతాండాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కసిరెడ్డి లలితమ్మ, మల్లారపు మధు లతో కలసి సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2019లో జరిగిన ఎన్నికల పాదయాత్ర సమయంలో జగనన్న చూసిన సమస్యలను గుర్తించి , వాటిని నవరత్నాలుగా ఏర్పాటు చేసి మ్యానిఫెస్టో అమలు చేశారన్నారు. దేశంలో ఏరాజకీయ పార్టీ కూడ ఇంత పటిష్టంగా హామీలను నేరవేర్చలేదన్నారు. రాష్ట్రంలోని పేదలకు రూ.2.70 లక్షల కోట్లు నేరుగా ఖాతాల్లోకి జమ చేసి దళారీలను అరికట్టారని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీలను అభివృద్ధి చేసేందుకు పాఠశాలలో ఇం•ష్‌ మీడియం కోర్సులను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీ క్రింద రూ.25 లక్షల వరకు వైద్యసేవలు అందించడం జరుగుతోందన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో పేదల హృదయాలలో జగనన్న చిరస్థాయిగా నిలిచిపోయాడని కొనియాడారు. జగనన్నను రెండవ సారి ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ గిరిజన తాండాలలో ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి , అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సంఘ నాయకులు ప్రభాకర్‌నాయక్‌, దళిత సంఘ నాయకుడు చెన్నరాయుడు , మల్లికార్జున , హనుమంతునాయక్‌, రాజునాయక్‌, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Jaganna’s ambition is not to live in poverty

Post Midle