Natyam ad

జగనన్న ప్రభుత్వంలోనే మైనారిటీల సంక్షేమానికి, అభివృద్ధికి పెద్ద పీట

-రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా

కడప ముచ్చట్లు:


జగనన్న ప్రభుత్వం లొనే మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కి పెద్ద పీట వేస్తున్నాం.  మైనారిటీ,  పేద బడుగుబాలహీన వర్గాల ప్రజలు సంక్షేమ పథకాలను తెలుసుకొని లబ్ది పొందాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ అన్నారు.సోమవారం నగరంలోని 35వ డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ షేక్ షంషేర్ బాషా  వారి  ఆధ్వర్యంలో నకాష్ -2వ సచివాలయం పరిధిలోని నకాష్, కేజర్ మసీదు వీధి, గోపాల్ స్వామి గుడి వీధి, మకాం గడ్డ వీధి  పలు ప్రాంతాలలో పర్యటన చేశారు
43 వ రోజు న  “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా  ప్రారంభించారు.ఈ సందర్భంగారాష్ట్రఉపముఖ్యమంత్రి.. స్థానిక కార్పొరేటర్, నాయకులు, అధికారులతో కలిసి.. ఆయా వీధుల్లో నివాసాలన్నింటినీ తిరిగారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి.. ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో నేరుగా మాట్లాడారు. పథకాల లబ్ధి సమాచారంతో కూడిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి సంతకం చేసిన బుక్ లెట్‌ను అంద‌జేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నవారు ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేయగా.. పలువురు తమ సమస్యలను అంజాద్ బాషా దృష్టికి తీసుకురాగా.. వెంటనే పరిష్కరించాలని సంబందిత అధికారులకు రెఫర్ చేశారు.

 

 

Post Midle

రాష్ట్ర ప్రజల సంక్షమం, అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవిధంగాప్రజలకుచేరుతున్నాయని.. ఉపముఖ్యమంత్రి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు సంతృప్త స్థాయిలో అందడం.. జగన్ మోహన్ రెడ్డి పారదర్శక పాలనకు అద్దం పడుతోందన్నారు. కార్యక్రమంలో… ప్రతి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం  అమలుచేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై లబ్దిదారుల మనోభావాలను తెలుసుకుంటూ ముందుకు సాగారుఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రితో పాటు  35వ డివిజన్ కార్పొరేటర్ షేక్ షంషేర్ బాషా, వైఎస్ ఆర్సిపి యువ నాయకులు అహమ్మద్ బాషా, అల్లాబకష్,  వైకాపా నగర మైనారిటీ అధ్యక్షులు షఫీ,  వైకాపా నాయకులు, నాయకురాళ్లు, వివిధ కార్పొరేషన్ ల ఛైర్మన్ లు, డైరెక్టర్లు, ఇతర నగర కార్పొరేటర్లు, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రమణారెడ్డి,  సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Jagannath is a big pillar for the welfare and development of minorities in the government

Post Midle

Leave A Reply

Your email address will not be published.