పుంగనూరులో జగనన్నకు జేజేలు…. అమ్మ ఒడి లబ్ధిదారుల సంబరాలు -కొండవీటి నాగభూషణం

Date:16/01/2021

పుంగనూరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి జగనన్నకు జేజేలు…అంటు అమ్మ ఒడి లబ్ధిదారులు , వారి పిల్లలు కలసి కేక్‌ కట్‌ చేసి, సంబరాలు జరిపారు. శనివారం స్థానిక ఉబేదుల్లా కాంపౌండులో లబ్దిదారులు అయిషా, నూరి, సాయిరాబి, చంద్రమ్మ, గుల్‌నాజ్‌ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. 15 కీలోల కేక్‌ కట్‌ చేసి, సంబరాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మాజీ కౌన్సిలర్‌ అమ్ము హాజరైయ్యారు. కేక్‌ కట్‌ చేసి, చిన్నారులకు తినిపించారు. నాగభూషణం మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల మ్యానిఫెస్టోలోని 90 శాతం హామిలను నేరవేర్చడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, విద్యార్థులు ఎవరు చదువులు ఆపివేయకుండ ఉండేందుకు అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి, ప్రతి విద్యార్థికి రూ.15 వేలు డబ్బులు ఇవ్వడం హర్షనీయమన్నారు. ముఖ్యంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందించడం జరుగుతోందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి పరుగులు తీస్తోందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మహబూబ్‌బాషా,జావీద్‌, ఫయాజ్‌, మమ్ము, మన్సూర్‌, శ్రీనివాసులు, రాజేష్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు యువజన సంఘ నాయకుడు చెంగారెడ్డి జన్మదిన వేడుకలు

Tags:Jagannath Jazz in Punganur …. Celebration of Amma Odi Beneficiaries -Nagabhushanam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *