Natyam ad

పుంగనూరులో 9న సీఎం చే జగనన్న ప్రాణవాయువు కేంద్రం ప్రారంభం

పుంగనూరు ముచ్చట్లు:
 
పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి సొంత నిధులు కోటి రూపాయలతో నిర్మించిన జగనన్న ప్రాణవాయువు కేంద్రాన్ని సోమవారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో ప్రారంభిస్తారు. ఆదివారం జిల్లా కలెక్టర్‌ హరినారాయణ్‌, జేసి శ్రీధర్‌, సబ్‌ కలెక్టర్‌ జహ్నవి, చిత్తూరు ఎంపి రెడ్డెప్ప కలసి కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఎంపి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఎవరు ఆక్సిజన్‌ లేకుండ ఇబ్బందులు పడరాదన్న ఆలోచనతో మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు ఎంపి మిధున్‌రెడ్డి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి చేతులు మీదుగా పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు సేవలు అంకితం చేస్తున్నట్లు ఎంపి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మంత్రి పిఏ మునితుకారాం తదితరులు పాల్గొన్నారు.

పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; Jagannath Oxygen Center inaugurated by CM on 9th at Punganur