జగన్ వి అసత్యప్రచారం : మంత్రి దేవినేని

Jagan's false allegation: Minister Devineni

Jagan's false allegation: Minister Devineni

Date:19/05/2018
విజయవాడ ముచ్చట్లు:
ప్రతిపక్ష నేత జగన్ పోలవరం పై విషం చిమ్ముతున్నారు. నీ స్వార్ధం కోసం రైతులకు ద్రోహం చేస్తే ప్రజలు క్షమించరని మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. శనివారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. మంచి చేయకపోయినా.. పట్టించుకోరు.. కానీ చెడు చేస్తే మాత్రం బుద్ది చెబుతారు. బెంగుళూరు ప్యాలస్ లు, క్విక్ ప్రోకో,  మాత్రమే జగన్ కు తెలుసని అయన అన్నారు. పోలవరం, డయా ఫ్రం వాల్  అంటే ఏమిటో తెలియని నువ్వా ప్రాజెక్టు ల గురించి మాట్లాడేదని అన్నారు. నీ చార్టెడ్ ఎకౌంటెంట్  విజయసాయి రెడ్డి అక్రమ మార్గంలో దోచుకోవడమే నీకు నేర్పాడు. నిర్ణీత కాలంలో పనులు పూర్తి చేసేందుకు అధికారులు రేయింబవళ్లు పరుగులు పెడుతున్నారని అన్నారు. ఇవేమీ చూడకుండా రాళ్లు వేయాలని కుట్రలు చేస్తే ఆరాళ్లు మీ పైనే పడతాయి. నీ తండ్రి వైయస్ పోలవరం మట్టి పనుల పేరుతో కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కనీసం నిర్వాసితులను కూడా ఖాళీ చేయించలేని మీరా మా ప్రభుత్వాన్ని విమర్శించేది. 53వేల కోట్లు తో జల సంరక్షణ పనులు చేపట్టి అన్ని ప్రాంతాల్లో చెరువులు, కాలువల్లో నీరు నింపామన్నారు. పచ్చకామెర్ల వ్యాధి తో బాధపడుతున్న జగన్..అందరినీ అదే దృష్టి తో చూస్తున్నాడని విమర్శించారు. వర్షాభావం తక్కువ గా ఉన్నా.. భూగర్భ జలాలు ను పెంచాం. విద్యుత్ కూడా ఎంతో ఆదా అయ్యింది. అబద్దాన్ని నిజం చేయాలనే ఆరాటంతో జగన్  పదే పదే అసత్యాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. గోదావరి పడవ ప్రమాదం పై మా ప్రభుత్వాన్ని జగన్  తప్పు పట్టడం దుర్మార్గమని అన్నారు. వారణాసి లో కాంట్రాక్టర్ తప్పిదం కారణంగా ఫ్లైఓవర్ కూలి ఇరవై మంది చనిపోతే మోడి పై కేసు పెట్టాలని నిలదీసే దమ్ము జగన్ కు ఉందా అని ప్రశ్నించారు. ప్రధాని మోడి ని నిలదీస్తే జైలుకు వెళతామనే భయంతో జగన్ బతుకుతున్నాడు. ఏడు కొండలు ఎందుకు .. రెండు కొండలు చాలు అన్న నీ తండ్రి ఎక్కడకి వెళ్లాడో అందరికి తెలుసని మంత్రి వ్యాఖ్యానించారు.  తిరుమల పవిత్ర తను దెబ్బ తీసేలా రాజకీయాలు నువ్వు చేయవద్దు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటే తగిన శాస్తి జరుగుతుందని అన్నారు. ప్రతిపక్ష హోదాను ప్రజలు అప్పగిస్తే .. వారి సమస్యలను వదిలి కుట్రలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. మాకు సోమవారం పోలవారం అయితే… నీ అవినీతి కారణంగా నీకు శుక్రవారం కోర్టువారం అయ్యిందని అన్నారు.
Tags; Jagan’s false allegation: Minister Devineni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *