అక్కచెల్లెమ్మలందరికి పక్కాగృహాల ఏర్పాటే జగన్ లక్ష్యం- మంత్రి పెద్దిరెడ్డి కృషి
332-చంద్రబాబు ఒక్క ఇళ్లెనా నిర్మించాడా..?
-తలమానికంలా టిట్కో గృహాలు
– ఒకొక్క ఇంటి విలువ రూ. 15 లక్షలు
పుంగనూరుముచ్చట్లు:

రాష్ట్ర చరిత్రలో ఎన్నడులేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరికి 30.75 లక్షల ఇండ్ల పట్టాలు మంజూరు చేసి ,పక్కా గృహాలు నిర్మించి , గృహప్రవేశాలు చేయించడం ఆయన లక్ష్యమని రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ షన్మోహన్, ఎంపీ రెడ్డెప్ప , జెడ్పి చైర్మన్ శ్రీనివాసులతో కలసి పుంగనూరులోని గూడూరుపల్లె వద్ద నిర్మించిన 1536 ఇండ్లను మంత్రి ప్రారంభించారు. అలాగే జగనన్న కాలనీలో పలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి మహిళలు నీరాజనాలు పలికారు. బాణసంచాలు, మేళతాళాలతో సంక్రాంతి పండుగ వలే గృహప్రవేశ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 72 వేల ఎకరాల భూమిని సేకరించి 17వేల జగనన్న కాలనీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తొలి సారిగా ముఖ్యమంత్రి చేతులు మీదుగా 7.43 లక్షల గృహాలు ప్రారంభించడం జరిగిందన్నారు. చిత్తూరు జిల్లాలో 73,584 గృహాలు మంజూరు కాగా అందులో 43 వేల గృహాలు పూర్తికాబడిందన్నారు.
పుంగనూరు నియోజకవర్గంలో 16 వేల మందికి పట్టాలు మంజూరు చేసి, గృహ నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. అలాగే పుంగనూరులో టిట్కో గృహాల్లో సుమారు రూ.10 లక్షలు విలువ చేసే స్థలంలో రూ.6 లక్షలు ఖర్చు చేసి అత్యంత సుందరంగా మౌళిక వసతులు ఏర్పాటు చేసి గృహప్రవేశాలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ఏనాడైనా భూములు కొనుగోలు చేసి ఒక్క ఇల్లు నిర్మించాడా అంటు మంత్రి నిల్యధీశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ప్రతి మహిళ పక్కా గృహాల్లో నివశించేందుకు వీలుగా ముఖ్యమంత్రి జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారన్నారు. అవి ప్రస్తుతం పట్టణాలుగా రూపొందుతున్నాయని కొనియాడారు. ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కోరుతూ రాష్ట్రం దశదిశ మార్చుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునేలా ప్రజలందరు ఆశీర్వధించాలన్నారు.
జెడ్పి చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో పులివెందుల తరహాలో పుంగనూరును మంత్రి పెద్దిరెడ్డి అభివృద్ధి చేస్తున్నారని, 30 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని పుంగనూరులో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రావడంతో అభివృద్ధి పరుగులు తీస్తోందని కొనియాడారు. జిల్లా కలెక్టర్ షన్మోహన్ మాట్లాడుతూ జిల్లాలో జగనన్న కాలనీలలో వేగవంతంగా పనులు జరుగుతున్నాయన్నారు. టిట్కో గృహాలు ఎంతో సుందరంగా నిర్మించి , పేదలకు అందించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న పరిపాలన పలు ర్ఖా•లకు మార్గదర్శకంగా నిలిచిందని కొనియాడారు. సంక్షేమ పథకాలలో కులం, మతం , పార్టీ లేకుండ అర్హులకు అందించిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వందేనని కొనియాడారు. ఈ సమావేశంలో టీటీడీ బోర్డు మాజీ మెంబరు పోకల అశోక్‌కుమార్. పీడీ పద్మనాభం, ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి, పీడీ రాధమ్మ, సీఈవో ప్రభాకర్‌రెడ్డి, కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: Jagan’s goal of establishing houses for all elder sisters – Minister Peddireddy’s efforts
