జగన్ పాలన నూతన అధ్యాయానికి శ్రీకారం – చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రంలో నూతన అధ్యాయం ప్రారంభమైందని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప కొనియాడారు. ఆదివారం పట్టణంలోని సాయిబాబాగుడివీధి, ఎల్‌ఐసికాలనీ విస్తరణ ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి జగనన్నే మాభవిష్యత్తు, మా నమ్మకం జగన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల వద్ద నుంచి నాలుగు ప్రశ్నలకు సమాదానాలు తెలుసుకుని, నమోదు చేసి రశీదు ఇచ్చారు. అలాగే లభ్ధిదారుల సమ్మతిపై ఇంటికి స్టిక్కర్లు వేయడం, మిస్‌డ్‌కాల్ ఇప్పించి ముఖ్యమంత్రితో మాట్లాడించడం చేయించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్యాలెండర్‌ను ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను అందించడం జరుగుతోందన్నారు. అన్ని రంగాల వారి అవసరాలను గుర్తించి , ఆర్థిక సహాయం అందించడం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పెద్దమనుసుకు నిదర్శనమన్నారు. రాష్ట మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల ఆధ్వర్యంలో నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు. కులాలకు, మతాలకు , పార్టీలకు అతీతంగా పుంగనూరు నియోజకవర్గంలో అర్హులైన వారందరికి సంక్షేమ పథకాలు అందించి, ఆదర్శంగా నిలిచామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సోషియల్‌మీడియా కోఆర్డినేటర్ నవీన్‌కుమార్‌రాజు, వైఎస్సార్‌సీపీ నాయకులు సురేష్, మల్లికార్జున, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Tags; Jagan’s rule begins a new chapter – Chittoor MP Reddeppa
