‘యాత్ర’ చిత్రంలో వై య‌స్ రాజారెడ్డి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు

Jagapathi Babu is in the role of YS Rajarareddy in 'Yatra'

Jagapathi Babu is in the role of YS Rajarareddy in 'Yatra'

Date:03/01/2019
తెలుగు వాళ్ల గుండెల్లో  ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి గా చ‌రిత్ర సృష్టించిన‌ డాక్ట‌ర్ వై.య‌స్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి  చేసిన పాద‌యాత్ర‌లో ముఖ్య ఘ‌ట్టాల‌తో నిర్మిస్తున్న‌చిత్రం యాత్ర‌. వై ఎస్ ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి వై ఎస్ ఆర్ పాత్రలో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశారు. ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్ ఈ యాత్ర‌ ని తెర‌కెక్కించారు. ఈ చిత్రాన్ని భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎం ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ వ్య‌యంతో, ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ప్ర‌మెష‌న్ మెటెరియ‌ల్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. డాక్ట‌ర్ వై య‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి తండ్రి వైయ‌స్ రాజారెడ్డి  పాత్ర‌లో జ‌గ‌ప‌తి బాబు న‌టించారు. ఈరోజు వైయ‌స్ రాజారెడ్డి  లుక్ విడ‌ద‌ల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ…మ‌హ‌నాయకుడు   వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేసిన‌ పాద‌యాత్ర నేప‌ద్యాన్ని తెర‌కెక్కిస్తున్న చిత్రం యాత్ర‌ ఉమ్మ‌డి ఆంద్ర‌ప్ర‌దేశ్ లోని పేద ప్ర‌జ‌ల‌, రైతుల భాద‌లు నేరుగా విన‌టానికి కొన‌సాగించిన స‌మ‌ర‌శంఖం ఈ యాత్ర‌.
చాలా మటికి రియ‌లిస్టిక్ గా చూపించ‌టానికి మా ద‌ర్శ‌కుడు మ‌హి ప్ర‌య‌త్నించారు. వైయ‌స్ ఆర్ పాత్ర‌లో మమ్ము‌ట్టి  అద్బుతంగా న‌టించారు.  మ‌మ్ముట్టి  డెడికేష‌న్ తో చేశారు. ఆయ‌నే తెలుగులో డ‌బ్బింగ్ చెప్ప‌టం విశేషం. మా బ్యాన‌ర్ లో భ‌లేమంచిరోజు, ఆనందోబ్ర‌హ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు యాత్ర చిత్రం హ్యాట్రిక్ చితంగా నిలుస్తుందనే  నమ్మకంతో ఉన్నాం. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ చిత్రంలో ఆద్యంతం ఎమోషన్ తో కూడిన పాత్ర‌లు, పాత్ర చిత్రణ కనిపిస్తుంది. వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి  తండ్రి  వైయ‌స్ రాజారెడ్డి  పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు  న‌టించారు. పాత్ర చిన్న‌దైనా చాలా ముఖ్య పాత్ర కావ‌టం తో మేము అడిగిన వెంట‌నే అంగీక‌రించిన జ‌గ‌ప‌తిబాబు కి మా ప్ర‌త్యేఖ ధ‌న్య‌వాదాలు. తెలుగు ప్ర‌జ‌లంద‌రూ త‌ప్ప‌కుండా చూడ‌వ‌ల‌సిన చిత్రంగా తెర‌కెక్కిస్తున్నాం. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 8న తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాల భాష‌ల్లో విడుద‌ల చేస్తాము.. అని అన్నారు. నటీ నటులు మమ్ముట్టి, రావ్ రమేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని, సచిన్ కడ్కర్, వినోద్ కుమార్, జీవా, 30 ఇయర్స్ పృథ్వి…..తదితరులు.
Tags:Jagapathi Babu is in the role of YS Rajarareddy in ‘Yatra’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *