అక్రమ మద్యం స్మగ్లింగ్ గుట్టును చేదించిన జగ్గయ్యపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో

జగ్గయ్యపేట ముచ్చట్లు:

 

జగ్గయ్యపేట స్పెషల్ బ్యూరో అధికారులు షేర్ మహమ్మద్ పేట క్రాస్ రోడ్ వద్ద నేషనల్ హైవే 65 పై మంగళవారం జరిపిన వాహన సోదాలలో తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ పట్టణం నుండి ద్విచక్ర వాహనం లోపల సీటు క్రింద మరియు సైడ్ ప్యానల్స్ లోపల, డూమ్ లోపల రహస్యంగా అమర్చి తెలంగాణ రాష్ట్రం నుంచి సుంకం చెల్లించని అక్రమమద్యాన్ని తెలివిగా రవాణా చేస్తున్న స్మగ్లర్ ను జగ్గయ్యపేట స్పెషల్ ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు అత్యంత చాకచక్యంగా పట్టుకోవటం జరిగింది. కోదాడ మండలం దోరకుంట గ్రామమునకు చెందిన సీమ్మసర్తి రాజు అనే వ్యక్తి మొత్తం 200 మద్యం బాటిల్స్ ని ద్విచక్ర వాహనంలో పైకి కనపడకుండా రహస్యంగా అమర్చి నందిగామ మండలం అనాసాగరం గ్రామమునకు చెందిన పెద్దమల్ల నరసింహారావు అనే బెల్ట్ షాప్ నిర్వాహకునకు సరఫరా చేయుటకు తీసుకుని వెళ్ళుతున్నట్లు దర్యాప్తులో తేలింది. కేసు తదుపరి విచారణలో భాగంగా అనాసాగరానికి చెందిన బెల్ట్ షాపు నిర్వాహకుడు పెద్దమల్ల నరసింహారావును స్థానిక జగ్గయ్యపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద అదుపులోనికి తీసుకోవడం . ఈ కేసులో మొత్తం ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుండి తెలంగాణ రాష్ట్రానికి చెందిన 200 మద్యం సీసాలను , ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఇతర రాష్ట్రాల నుండి సుంకం చెల్లించని మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని జగ్గయ్యపేట స్పెషల్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠ రెడ్డి తెలిపారు.

 

Tags;Jaggaiyapet Special Enforcement Bureau busts illegal liquor smuggling ring

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *