పోలీసు కస్టడిలో జగ్గారెడ్డి

Jaggareddy in police custody
Date:19/09/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
మానవ అక్రయ రవాణా కేసులో ఆరెస్టయిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విచారణ మొదటి రోజుముగిసింది. మూడు రోజుల కస్టడికి తీసుకున్న పోలీసులు జగ్గారెడ్డిని సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో న్యాయవాది సమక్షంలో విచారించారు. పాస్ పోర్ట్ ,ఏజెంట్ ల వివరాల కు సంబంధించిన ప్రశ్నలు అడిగినట్లు అయన తరపు న్యాయవాది మీడియాకు వెల్లడించారు.
తాను ఒక ప్రజా ప్రతినిధిని కనుక తన నియోజకవర్గం నుండి ఎంతో మంది సంతకాల కోసం వస్తుంటారని జగ్గారెడ్డి సమాధానం చెప్పినట్లు సమాచారం. 14 సంవత్సరాల క్రితం జరిగిన ఈ కేసు లో చాలా మంది వ్యక్తులు మారారని చెప్పారన్నారు. ఈ కేసు తో తనకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి జగ్గారెడ్డి పోలీసులకు చెప్పారని న్యాయవాది తెలిపారు. సోమవారం బెయిల్ పిటీషన్ పై వాదనలు ఉన్నాయన్నారు.
Tags:Jaggareddy in police custody