రాజగోపాల్‌రెడ్డి బాటలోనే జగ్గారెడ్డి?  

మెదక్ ముచ్చట్లు:
తెలంగాణ కాంగ్రెస్‌ తీరు మారదా? మంచిరోజులు కనుచూపు మేరలో లేవా? పార్టీలో పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? హస్తం అస్తవ్యస్తమవుతున్నా పట్టించుకోరా? గాంధీభవన్‌ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్నలివి. కొన్నిరోజులు ఒకరు.. మరికొన్ని రోజులు ఇంకొకరు అలక వహించడం కామన్‌ అయిపోయింది. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు. అప్పట్లో బీజేపీని భుజానికి ఎత్తుకున్నారు. తర్వాత సైలెంట్‌ అయినా అప్పుడప్పుడు ఆయన మనసు అటే లాగుతోంది. కాంగ్రెస్‌లోనే ఉంటాననే నమ్మకం కలిగించలేక పోతున్నారు రాజగోపాల్‌రెడ్డి. పార్టీ సభ్యత్వ నమోదే ఇందుకు సాక్ష్యం. కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వం నమోదుపై ఆయన ఫోకస్‌ పెట్టలేదు. ఆయన చొరవ తీసుకుని ఉంటే మునుగోడులో లెక్క వేరేలా ఉండేదిఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి బాటలోనే ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెళ్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ శ్రేణులు. తాజా ఎపిసోడ్‌లో జగ్గారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుకున్నారట. ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. జగ్గారెడ్డిని పార్టీ నేతలు బుజ్జగిస్తున్న క్రమంలోనే రాజగోపాల్‌రెడ్డి ఫోన్‌ చేశారట. రాజీనామాపై తొందరపడకు.. ఇద్దరం కలిసి ఒకేసారి నిర్ణయం తీసుకుందామని జగ్గారెడ్డికి సూచించారట రాజగోపాల్‌రెడ్డి. ఇంతలో 15 రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటామని జగ్గారెడ్డి ప్రకటించడంతో.. ఆయన సూచనతోనే ఆ గ్యాప్‌ తీసుకున్నారా అనే అనుమానం కలుగుతోందట.జగ్గారెడ్డి కూడా ఇప్పటికిప్పుడు వ్యవహారాన్ని తెగ్గొట్టేయాలని చూడటం లేదు. కాంగ్రెస్‌ ముఖ్యుల సూచనతో సమస్యను చక్కబెట్టే అవకాశం ఉంది. అయితే రాజగోపాల్‌రెడ్డి తరహాలోనే కాంగ్రెస్‌లోనే ఉంటూ.. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారా? లేక పార్టీతో అంటీముట్టనట్టు ఉంటారా అనేది చూడాలి. పార్టీకి అంటీముట్టనట్టు ఉండటం జగ్గారెడ్డితో అయ్యే పనికాదు. మాట్లాడాలని అనుకుంటే అస్సలు ఉండలేరు. కాంగ్రెస్‌లో రాజగోపాల్‌రెడ్డి ఏ విధంగా రియాక్ట్‌ అవుతారో జగ్గారెడ్డి కూడా అంతే. మరి.. తాజా ఎపిసోడ్‌లో జగ్గారెడ్డి ఎవరిని ఫాలో అవుతారో? ఎవరి మాట వింటారో కాలమే చెప్పాలి. కాకపోతే ఉన్న కొద్దిమంది ఎమ్మెల్యేలలో ఇద్దరు శాసనసభ్యుల తీరు మాత్రం కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ అవుతోంది.\
 
Tags:Jaggareddy on the path of Rajagopal Reddy?

Leave A Reply

Your email address will not be published.