జగ్గయ్యపేట శ్రీ తిరుపతమ్మ దేవాలయం హోదా కుదింపు
అర్చక,ఇంజనీరింగ్ పోస్టులకు మంగళం
విజయవాడ ముచ్చట్లు:

జగయ్యపేట లో ని ప్రముఖ క్షేత్రం పెనుగంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం ప్రాంతీయ సంయుక్త కమిషనర్ (ఆర్జేసీ) హోదాను డిప్యూటీ కమిషనర్ (డీసీ)కి కుదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హోదా కుదింపునకు సంబంధించి గడిచిన రెండేళ్ల క్రితమే మంత్రాంగం జరిగింది. ఆలయ ఆదాయం తగ్గుతోందనే సాకుతో హోదా కుదింపునకు ప్రయత్నాలు చేశారు.ఈ విషయమై అప్పట్లో స్థానికులు, భక్తుల నుంచి అభ్యంతరాలు వ్యక్త మైనా ఆ సమయంలో ఈవోగా విధులు నిర్వర్తించిన శోభారాణి హోదా కుదింపునకే ప్రయత్నాలు చేశారు. అందుకు స్థానిక ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సైతం ఆమెకు మద్దతు తెలపడంతో హోదా కుదింపు దస్త్రాలు వేగంగా కదిలాయి. 2001 వరకు అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) హోదాలో ఉన్న ఆలయాన్ని ఒక్క సారిగా ప్రాంతీయ సంయుక్త కమిషనర్ (ఆర్ జేసీ) హోదాకు పెంచారు. అప్పటి నుంచి అదే హోదాలో ఆలయం కొనసాగుతోంది.అప్పట్లో హోదా పెరగడంతో ఇంజినీరింగ్ గంలో ఏఈ, డీఈఈ, ఈఈ నాలుగు వేదాలకు నలుగురు వేద తులు, అర్చకుల పోస్టులు పెరిగాయి.ఆలయ పరిపాలన పరిమితులు పెరగడంతో కార్యాలయంలో క్లర్కులు, అసిస్టెంట్ పోస్టులు వచ్చాయి. 20 ఏళ్ల క్రితం దేవాలయానికి ఏడాదికి 10 లక్షల మంది వస్తుంటే నేడు ఆ సంఖ్య నేడు 50 లక్షలకు పెరిగింది. ఆదాయం సైతం ఏడాది రూ.14 కోట్లకు చేరింది. కొవిడ్ సమయంలో ఒక్కసారిగా రూ.5 కోట్లకు పడిపోయి, ఆ తర్వాతి ఏడాది. నుంచి రూ.12 కోట్లకు చేరింది.ఉద్యోగుల్లో ఆందోళనఆర్జేసీ హోదాలో ఆలయం ఉంటే అవసరాలక పెరుగుతాయి.అనుగుణంగా పోస్టులు గడిచిన 20 ఏళ్లుగా అలాగే ఉద్యోగాలు కల్పించారు. ఇప్పుడు ఒక్కసారిగా డీసీకి కుదించడంతో ఇంజినీరింగ్ విభాగంలో ఈఈ, వేద పండితుల పోస్టులు పోనున్నాయి. కార్యాలయంలో క్లర్కులు, రికార్డు అసి స్టెంట్లు, సూపరింటెండెంట్ పోస్టులు తగ్గిపోతాయి.ఆలయంలో అర్చకుల పోస్టులు, ఇతర సిబ్బందిని తగ్గించనున్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగు ణంగా దినసరి వేతన పోస్టులు ఉండవని తెలుస్తోంది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.
Tags: Jaggayapet Sri Tirupatamma Temple status reduction
