ఘనంగా జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు

విశాఖ ముచ్చట్లు:

దేశ ఉప ప్రధాని,సంఘ సంస్కర్త. రాజకీయవేత్త బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి.కేంధ్ర మంత్రి,ఉప ప్రధానిగా దేశానికి అందించిన సేవలను కొనియాడుతూ ఏయూ , ఆర్కేబీచ్ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి పలువురు నేతలు ఘనంగా నివాళి అర్పించారు.ఏయూలో మాదిగ పోరాట సమితి ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గోన్న సమితి సభ్యులు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఘనంగా అజంలి ఘటించారు.బాబు జగ్జీవన్ రామ్ జీవిత కాలంలో అట్టడు వర్గాల అభ్యుదయం,నిమ్నజాతీయులకు అందించిన సేవలు మరువలేనివని అన్నాకు.కేంధ్ర మంత్రిగా పలు శాఖలకు సేవలు అందిస్తూనే వాటి ద్వారా అత్యున్నత స్ధాయిలో మంచి గుర్తింపు తీసుకురావడంతో పాటు వాటి ప్రయోజనాలను లబ్దిదారులకు అందించడంలో ప్రముఖ పాత్రను పోషించారని అన్నారు.పాకిస్తాన్ యుద్దం వచ్చే సమయంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ భారత సైన్యం విరోచితంగా పోరాటం చేసేలా వారిలో దైర్యాన్ని నింపారని అన్నారు.ముఖ్యంగా సాగర తీరంలో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాం పరిరక్షించడంలో అధికారులు వైఫల్యాన్ని ఈ సందర్బంగా సభ్యులు ఎండగట్టారు.

 

Tags: Jagjivan Ram’s birth anniversary celebrations

 

Leave A Reply

Your email address will not be published.