Natyam ad

మాల ల ఐక్యత అభివృద్ధి కోసమే జై భీమ్  మాల మహాసేన- అధ్యక్షులు పల్లెకొండు సంపత్

కడప ముచ్చట్లు:


మాలల అభివృద్ధి కోసమే జైభీం మాల మహాసేన పనిచేస్తోందని అధ్యక్షులు పల్లె కొండు సంపత్ కుమార్ అన్నారు మంగళవారం   జై భీమ్.మాల మహాసేన  మొదటి వార్షికోత్సవంసందర్భంగా స్థానిక మసాపేట లో బాబాసాహెబ్ అంబెడ్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి  ఘనంగా మొదటి వార్షికోత్సవము నిర్వహించారు ఈ సందర్భంగా జై భీమ్ మాల.మహాసేన అధ్యక్షులు పల్లెకొండు సంపత్ కుమార్ తెలుపుతూ మాలల అభివృద్ధి ఐక్యత కోసమే మాల మహాసేన ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు  ఈ సంవత్సర కాలంలో కడప నగరం లో ప్రతి దళిత వాడలో భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటాలు పంపిణీ చేసి అందరినీ ఐక్యం చేశామని చెప్పారు  అలాగే కడప నగరం లోని ప్రముఖులకు భారత రాజ్యాంగం పుస్తకాలు అందించామ న్నారు  .దళిత పిల్లల కు ప్రైవేట్ స్కూల్ లో చదువు చెప్పించామని, ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రతి దళిత కుటుంబం అందుకునే లా సహకారాన్ని ఇచ్చామన్నారు మాల లకు ఏ సమస్య వచ్చినా అండగా మాల మహాసేన ఉంటుందని చెప్పారు  మాల లు సామాజిక రాజకీయ ఆర్థిక ఎదుగుదల కు మాల మహాసేన సహకారము మాలలకు అన్ని వేళలా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జై భీమ్ మాల మహాసేన ఉపాధ్యక్షుడు బండి రమణ, ప్రధాన కార్యదర్శి చైతల్య, కోశాధికారి శ్యాంసున్, కార్యదర్శి బల్లి చిన్ని, కార్యవర్గ సభ్యులు కొమ్మలపాటి లావణ్య, రత్న కుమారి, సుశీలమ్మ, వసంత్,ఇరగయ్య,చంద్ర,అయ్యవరయ్య, కొమ్మలపాటి సుబ్బారాయుడు, వినోద్ కుమార్,నాగార్జున,ప్రణవతి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Jai Bheem Mala Mahasena- President Pallekondu Sampath for the development of the unity of Malas

Post Midle
Post Midle