ప్రకాశంలో జంబలకిడి పంబ

ఒంగోలు ముచ్చట్లు:

 

ప్రకాశం జిల్లాలో జంబలకిడిపంబ సినిమా ఘటన చోటుచేసుకుంది. వధువు అబ్బాయిలా.. వరుడు అమ్మాయిలా మారిపోయారు. అమ్మాయి ప్యాంటూ చొక్కా వేసుకుని హుందాగా నడిచొస్తుంటే.. అబ్బాయి చీరకట్టుకుని సిగ్గులొలికిస్తూ ఆమె పక్కనే నిల్చోవడం చూపరులను ఆకట్టుకుంది. కాస్త వింతగా ఉన్నా.. అది వారి ఆచారమట. ఆ ఇంటి పేరు ఉన్న వారెవరైనా వివాహం జరిగిన తర్వాత అమ్మాయి అబ్బాయిలా.. అబ్బాయి అమ్మాయిలా ముస్తాబై తమ ఇష్టదైవాలకు పూజలు చేస్తారట.మార్కాపురం సమీపంలోని పెద్దారవీడు మండలం బి.చెర్లోపల్లి గ్రామానికి చెందిన గుమ్మా ఆవులయ్య కొడుకు అంకయ్యకి అరుణ అనే యువతితో ఇటీవల వివాహం జరిగింది. పెళ్లి తరువాత గ్రామ దేవతలు పోలేరమ్మ, అంకాళమ్మకు పూజలు చేశారు. వివాహానంతరం నవ వధువు అబ్బాయిలా.. వరుడు అమ్మాయి వేషధారణలో జమ్మి చెట్టు, నాగుల పుట్ట వద్ద పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోందట. దీంతో వరుడు అంకయ్య చీర కట్టుకోగా.. వధువు అరుణ ప్యాంటూ చొక్కా వేసుకుని ఊరేగింపు నడుమ గ్రామ శివారులోని జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. తమ వంశంలో పూర్వీకుల నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు వరుడి కుటుంబ సభ్యులు తెలిపారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Jambalakidi Pamba in brightness

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *