జమ్ము కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌, ఆరుగురు ఉగ్రవాదుల హతం

Jammu and Kashmiri encounters and six terrorists killed

Jammu and Kashmiri encounters and six terrorists killed

Date:23/11/2018
శ్రీనగర్‌ ముచ్చట్లు:
జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌ నాగ్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. శుక్రవారం తెల్లవారు జామున జమ్ము కశ్మీర్‌ పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా బిజ్‌భేరా పట్టణంలోని సెకిపోరా ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురిని హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు. వారి నుంచి మారణాయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని, ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు.గత కొన్ని నెలలుగా జమ్ములో ఉగ్రవాద కార్యకలాపాలు అధికంగా ఉండడంతో భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు చేపట్టి ఉగ్రవాదులను ఏరివేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం షోపియన్‌ జిల్లా నదిగామ్‌ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు నలుగురు ముష్కరులను హతమార్చాయి. ఈ ఘటనలో ఓ జవాను సైతం ప్రాణాలు కోల్పోయాడు.
Tags:Jammu and Kashmiri encounters and six terrorists killed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *