జనవరి 12న జనసేన యువశక్తి కార్యాక్రమం
విశాఖపట్నం ముచ్చట్లు:
జనవరి 12న యువ శక్తి అనే కార్యక్రమాన్ని జనసేన నిర్వహి స్తోందని పిఏసి ఛైర్మన్ నాదెండ్ల మనో హర్ విశాఖలో ప్రకటించారు. శ్రీకాకు ళం జిల్లా రణ స్థలంలోఈ కార్యక్రమా న్ని నిర్వహిస్తామని,అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని ఒక యువజనోత్సవం గా వేడుక నిర్వహిస్తామని తెలిపారు. యువత కు భరోసా ఇవ్వడానికి ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామ ని,వారాహి విషయంలో కొందరు నేతలు హడావుడి చేస్తున్నామని, నిబందనల ప్రకారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.జగన్నన్న కాలనీ ఒక పెద్ద కుంభకోణమని,చిత్త శుద్ధి లేని ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.మూడు నెలల్లో ఏపీ ఆస్తులు తెలంగాణాకు కట్టబెట్టారని,రాష్ట్రం కలసి ఉంటే బాగుటుందనే వ్యఖ్యలతో ప్రజలను అయోమయస్థితిలోకి నెట్టుతున్నారని అన్నారు.రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని మానసిక ఒత్తిడి కి గురి చేస్తున్నారని అన్నారు.
Tags: Jan Sena Yuvashakti program on January 12

