Natyam ad

జానారెడ్డి రాజకీయ సన్యాసం

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణలోని కాంగ్రెస్ రాజకీయ దిగ్గజం కుందూరు జానారెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారా..? వయోభారంతో క్రియాశీలక రాజకీయాలనుంచి వైదొలగాలని భావిస్తున్నారా..? తన రాజకీయ వారసత్వాన్ని కుమారులతో కొనసాగించేలా పక్కా ప్రణాళిక రచించారా..? అనే ప్రశ్నలు గత కొన్నిరోజుల నుంచి తలెత్తున్నాయి. వీటి గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయ దురంధరుడు జానారెడ్డి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. 2023లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోబోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక కాలం మంత్రిగా ఆయన పనిచేశారు. ఇక నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో జానారెడ్డికి గట్టిపట్టుంది. వయోభారంతో క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలగాలని జానారెడ్డి భావిస్తున్నారు. తన రాజకీయ వారసత్వాన్ని కుమారులతో కొనసాగించేలా పక్కా ప్రణాళిక రచించారు.2018, 2020 ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత జానారెడ్డి రాజకీయంగా సైలెంట్‌గా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ నేతల నుంచి పీసీసీ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ దరఖాస్తులకు నేడు చివరి తేదీ. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలంతా తాము పోటీచేసే స్థానాల్లో దరఖాస్తు చేసుకున్నారు. కానీ జానారెడ్డి అప్లై చేయలేదు. ఆయన స్థానంలో నాగార్జుసాగర్ నుంచి జానారెడ్డి చిన్న కుమారుడు జైవీర్‌ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.

 

 

 

Post Midle

ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని జానారెడ్డి నిర్ణయం తీసుకోవడంతో ఆయన చిన్న కుమారుడు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. నాగార్జున సాగర్ 2020లో జరిగిన ఉప ఎన్నికల నుంచి జానారెడ్డి చిన్న కొడుకు జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ లోనే మకాం వేసి కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. దీంతో ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని జానారెడ్డి నిర్ణయం తీసుకోవడంతో ఆయన చిన్న కుమారుడు ఎన్నికల బరిలోకి దిగుతున్నారుమరోవైపు బీఆర్ఎస్ నుంచి తొలి జాబితాను సీఎం కేసీఆర్ ఇప్పటికే విడుదల చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చారు. నాగార్జున సాగర్ నుంచి బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ బరిలోకి దిగుతున్నారు. నోముల భగత్ చేతిలో పరాజయాన్ని చవిచూసిన జానారెడ్డి.. ఈసారి ఎన్నికల్లో భగత్‎తో తనయుడు జైవీర్ తలపడేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ దరఖాస్తుల గడువు నేటితో ముగుస్తోంది.  చివరి రోజు కావడంతో భారీగా అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు భావిస్తున్నాయి. దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత పరిశీలించి సర్వేల రిపోర్టుల ఆధారంగా అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

 

 

ఆరోందలకు పైగా ఆశావహులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఆశావహులు క్యూకడుతున్నారు. ఒక్కో అసెంబ్లీ సీటుకు ముగ్గురు నలుగురు నేతలు దరఖాస్తు చేసుకుంటున్నారు. తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని నేతలకు విన్నవించుకుంటున్నారు. ఇప్పటికే 600 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లలో కొందరు స్వయంగా గాంధీభవన్ కు వచ్చి దరఖాస్తులు సమర్పించారు.  మరికొందరు నేతలు తమ వ్యక్తిగత సిబ్బందితో దరఖాస్తు  పంపించారు.  ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గానికి ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అత్యధికంగా మూడు నియోజకవర్గాలకు దరఖాస్తులు సమర్పించారు. తన ఆశావాహులు అందరితో దరఖాస్తులను పెట్టించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మాజీ ఎంపీ, క్రికెటర్ అజారుద్దీన్ నుంచి దరఖాస్తు చేశారు.  జనగామ నియోజకవర్గం సీటును  మాజీ మంత్రి  పొన్నాల లక్ష్మయ్య ఆశిస్తున్నారు.

 

 

 

పొన్నాల తరపున నియోజకవర్గంలోని 4 మండలాల అధ్యక్షులు గాంధీభవన్ కు వచ్చి పొన్నాల తరుపున దరఖాస్తులు సమర్పించారు. పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి.. దరఖాస్తు చేసుకున్నారు. కొడంగల్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా…నల్గొండ అసెంబ్లీ టికెట్ కోసం దరకాస్తు పెట్టారు. కాంగ్రెస్ సీనియర్ జానారెడ్డి తనయుడు జయవీర్ నాగార్జున సాగర్ టికెట్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు.  గడువు పొడిగించేది లేదని పీసీసీ స్పష్టం చేయడంతో ఆఖరి రోజు దరఖాస్తుల హడావుడి పెరగబోతుంది. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ చురుగ్గా కసరత్తు చేస్తోంది. ఆశావహుల నుంచి వచ్చిన దరఖాస్తులను పీసీసీ ఎన్నికల కమిటీ నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థుల చొప్పున స్క్రీనింగ్ కమిటీకి సిఫార్సు చేయనుంది.  దరఖాస్తు చేసుకున్న వారిపై సర్వేలు చేసిన తర్వాత ఫైనల్ గా అభ్యర్థిని ఖరారు చేయనుంది హస్తం పార్టీ.

 

Tags: Jana Reddy’s political asceticism

Post Midle