Natyam ad

మహిళా కమిషన్ కు జనసేన కౌంటర్

విజయవాడ ముచ్చట్లు:


ఏపీలో జనసేన వర్సెస్‌ మహిళా కమిషన్‌. మూడు పెళ్లిళ్ల కామెంట్స్‌ మహిళా కమిషన్‌ పవన్‌ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేయడంపై జనసేన మండిపడుతోంది. మహిళా కమిషన్‌కు ప్రశ్నలు సంధిస్తూ వరుస ట్వీట్లు చేస్తోంది. మహిళాలపై దాడులు,అత్యాచారాలు జరిగినప్పుడు మహిళా కమిషన్‌ ఎక్కడ ఉందని వరుసగా ప్రశ్నలు సంధిస్తోంది. #APWomenCommissionExposed అనే హ్యాష్‌ ట్యాగ్‌తో షేర్‌ చేస్తోన్న ఈ పోస్టులు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ జాతీయ స్థాయిలో ట్రెండింగ్ లో 4వ స్థానంలో ఉండడం గమనార్హం.
మహిళా కమిషన్‌కు జనసేన సంధించిన ప్రశ్నలివే..
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విజయవాడ నగరంలో 23 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. అప్పుడు ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? ఏం చేసింది ?దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో 32 ఏళ్ల మహిళ ఇంట్లో అనుమానాస్పదంగా హత్యకు గురైంది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

 

 

మే 2022లో, బాపట్ల జిల్లాలోని రేపల్లె రైల్వే స్టేషన్‌లో 25 ఏళ్ల గర్భిణిపై దాడి చేసి సామూహిక అత్యాచారం చేశారు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
అత్యాచారం చేసేందుకు రాలేదు.. దొంగతనం కోసం వచ్చి ఆపైన అత్యాచారం చేశారు అని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మృగాళ్లకు సర్టిఫికేట్ ఇచ్చారు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
అత్యాచారాలకు తల్లి పెంపకమే లోపం అని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి ప్రకటించారు. ఈ ప్రకటన మహిళా లోకాన్ని, మాతృమూర్తులను అవమానించడం కాదా? ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
2021లో మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల సంఖ్య 25శాతానికి పైగా పెరిగాయని రాష్ట్ర పోలీసులు డిసెంబర్ 28, 2021న వెల్లడించారు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
మే 2022లో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఇద్దరు పిల్లల తల్లి అయిన 26 ఏళ్ల యువతిపై లైంగిక దాడి జరిగింది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
2021 ఆగస్టులో గుంటూరులో 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థినిపై పట్టపగలు దుండగుడు దాడి చేసి కడుపుపై ఆరుసార్లు కత్తితో పొడిచాడు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
2021లో మహిళలపై నేరాలకు సంబంధించి 17736 కేసులు నమోదయ్యాయి. రిపోర్టు చేయని మరియు నమోదు కాని కేసులను కలుపుకొంటె సంఖ్య చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

 

 

Post Midle

మే 2022లో సీఎం సొంత జిల్లా కడప ప్రొద్దుటూరులో దళిత మైనర్ బాలికపై సుమారు ఏడాది పాటు అత్యాచారం జరిగింది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
జూన్ 2021లో సీఎం నివసిస్తున్న తాడేపల్లి దెగ్గరలో మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు పాల్పడ్డవారిలో ఒక వ్యక్తి ఇప్పటికీ దొరకలేదు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
సుగాలి ప్రీతికి న్యాయం చేయలేరు. సీబీఐకి కేసు ఇస్తున్నామన్నారు. ఎంత వరకు వచ్చింది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
రెండు మూడు అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి, వాటికే గోల చేయాలా అంటూ ఎదురు ప్రశ్న వేస్తారు మరో మహిళా మంత్రి గారు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
ఎంపీ హోదాలో ఉంటూ అసభ్యకరమైన వీడియో కాల్‌లో దొరికిపోతే నైతిక బాధ్యత మర్చిపోయిన ఆ ఎంపీని వెనకేసుకొస్తుంది వైసీపీ ప్రభుత్వం. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
వైసీపీ పార్టీలో మహిళలతో అసభ్యకరంగా మాట్లాడితే మంత్రి పదవి ఇస్తారు. ఇంకేం చేసుద్ది.. ఒక గంట వచ్చి వెళ్లిపో లాంటి మాటలతో మహిళలను లొంగదీసుకొనే పనులు చేస్తారు వైసీపీ ప్రజా ప్రతినిధులు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
సంవత్సరాలపాటు ప్రెస్ మీట్లు పెట్టి మహిళలను తక్కువ చేసి మాట్లాడతారు వైసీపీ లో మంత్రులు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
గుడివాడలో సంక్రాంతి సంబరాల పేరుతో చీర్ గాళ్స్ ను ఏర్పాటు చేసి రాష్ట్ర మంత్రి అండతో క్యాసినోలు నడిపారు. ఇక్కడ చీర్ గాళ్స్ ను భోగ వస్తువుగా చూపించలేదా? ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

 

Tags: Jana Sena Counter to Women’s Commission

Post Midle