Natyam ad

 పిఠాపురంలో జనసేన  రాజకీయం

కాకినాడ ముచ్చట్లు:


పిఠాపురం జనసేనలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ఇక్కడి నుంచే పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా జనసేన సీటు కోసం మాత్రం రాజకీయ ఉద్దండులు చేతులు చాపుతున్నారు. రోజు రోజుకూ సీటు ఆశిస్తున్న వారి పేర్లు వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. వైసీపీలో తాజాగా చక్రం తిప్పుతున్న నేతల బంధువులు, గతంలో టీడీపీలో చురుకుగా పని చేసి,శాసనసభకు కూడా వెళ్ళిన నేతలు, ఇలా ఎంతో కొంత ఇమేజ్ ఉన్న నాయకులు సీటు కోసం పరుగులెడుతున్నారు. చాలా మంది తరుచూ భాగ్యనగరం పయనమౌతున్నారు. అధినేత పవన్ దృష్టిలో పడేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఎలాగైనా పిఠాపురం సీటు తమకిస్తే గెలిచి వస్తామని అంటున్నారు. మాకినేడి శేషుకుమారి ఇక్కడ ఇన్చార్జిగా ఉన్నారు. గతంలో ఆమె పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఆమెకు జన బలం లేదని తాజా ఔత్సాహికుల వాదన.గండేపల్లి సూర్యవతి పిఠాపురం వైస్ చైర్మగా ఉన్నారు. ఆమె భర్త గండేపల్లి బాబీ వైసీపీలో కీలక నేత. ఇతన్ని సెకండ్ యంఎల్‌ఏ అని కూడా అంటారు. నియోజకవర్గంలో యంఎల్‌ఏ దొరబాబు తర్వాత అంతటి పవర్ ఉన్న నాయకుడు బాబీ. ప్రస్తుతం అతని అల్లుడు పిల్లా శ్రీధర్ పవన్ కళ్యాణ్‌ను కలిశారు. తన శ్రీమతి దీపకతో కలిసి పవన్ కళ్యాణ్‌ను కలవడం చర్చనీయాశమయింది.

 

 

 

వచ్చే ఎన్నికల్లో సీటు కోసం శ్రీధర్ ప్రయత్నాలు చేస్తున్నారు. స్వతహాగా వైద్యుడైన శ్రీధర్ గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు పెడుతున్నారు. ఇటీవల వనభోజనాలు పెట్టి చాలా సొమ్ములు ఖర్చు పెట్టారు. పార్టీ కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో శ్రీధర్‌కు టికెట్ ఏమౌంతుందో అనే ఆసక్తి నెలకొంది.పిఠాపురం యంఎల్‌ఏ పెండెం దొరబాబు అల్లుడు కూడా పవన్ కళ్యాణ్‌తో టచ్‌లో ఉంటున్నారు. ఇతను కూడా టికెట్ రేసులో ఉన్నారు. వీలైతే కాకినాడ రూరల్ ఇవ్వాలని ఆయన పట్టుపడుతున్నారు.పూర్వం నుంచి టీడీపీలో ఆరితేరిన వర్మ 2014లో సీటు ఇవ్వకపోవడంపో స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మంచి మెజార్టీతో గెలుపొదారు. ఈ తర్వాత టీడీసీ తీర్థ పుచ్చుకున్నారు. ప్రస్తుతం అదే పార్టీలో ఉంటున్న వర్మ సడన్‌గా హైదరాబాద్ వెళ్ళి పవన్‌ను కలిసినట్లు సమాచారం. నియోజక వర్గంలో 90 వేల మంది వరకు కాపులున్నారు. కావున ఎవరు సీటు తెచ్చుకున్నా జనసేన అభ్యర్ధిగా గెలుపు ఖాయమని భావిస్తున్నారు. దీంతో ఇక్కడ డిమాండు పెరిగింది. ఈ నేపథ్యంలో వర్మ కూడా జనసేన వైపు చూస్తున్నారుగతం నుంచీ జనసేనలో ఉంటున్న మాకినేడి శేషుకుమారినకు అంత బలగం లేదని అంటున్నారు. కేడర్ తక్కువగా ఉందని అంటున్నారు.ఈ ప్రభావం గెలుపు ఓటముపై పడనుంది. అయితే భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.

 

Post Midle

Tags: Jana Sena politics in Pithapuram

Post Midle

Leave A Reply

Your email address will not be published.