రైతులకు అండగా 7న జన సేన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు

– జనసేన అధినేత

Date:05/12/2020

నెల్లూరు  ముచ్చట్లు:

రాష్ట్రంలో తుఫాన్ వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు రూ. 35 వేల నష్టపరిహారం చెల్లించాలని, వాటిలో తక్షణం పదివేల పరిహారాన్ని వెంటనే ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని మినర్వా గ్రాండ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు కన్నీరు పెడితే రాష్ట్రం,దేశం సుభిక్షంగా ఉండదన్నారు.రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందన్నారు.రెండు రోజుల లోపల రైతులకు నష్ట పరిహారం చెల్లించకుండా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా జనసేన ఆధ్వర్యంలో 7వ తేదీన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. వైసీపీ నుంచి 151 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారని వారి ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగాలన్నారు.గత ఎన్నికలకు ముందు విడతలవారీగా మద్యనిషేధం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రక రకాల బ్రాండ్ల పేరుతో మద్యాన్ని ప్రవహింప చేస్తున్నారన్నారు. మద్యం అమ్మకాల ద్వారా రూ.16 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తోందని దానిని రైతులకు చెల్లించాలని కోరారు.

జాంభి రెడ్డి” టీజర్ అదిరిపోయింది.. నాకు బాగా నచ్చింది.. సమంత !!

Tags: Jana Sena state-wide agitation on 7th on behalf of farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *