నేడు జనసేన ‘యువశక్తి’ సభ..పవన్ కళ్యాణ్ అరెస్ట్ తప్పదా ?
అమరావతి ముచ్చట్లు :
జనసేన పార్టీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాళ్లవలస వద్ద జనసేన ఆధ్వర్యంలో ‘యువశక్తి’ సభ నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.ఈ సభ కోసం 30 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ సభ జరగనుంది. మధ్యాహ్నం సభ వేదిక వద్దకు చేరుకోనున్న పవన్, యువతతో మాట్లాడాక ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సభకు సుమారు 1.50 లక్షల మంది వస్తారని అంచనా. మరి సెక్షన్ 1 అమలు లో ఉన్న నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారో చూడాలి.

Tags; Jana Sena’s ‘Yuvashakti’ meeting today…Is Pawan Kalyan arrested?
