Natyam ad

నల్లారి సభకు జనం నై… తెలుగు దేశం కోడ్‌ ఉల్లంఘన

– బాణసంచాల హోరు
– జనానికి మధ్యం, భోజనం
– కట్టుకథలతో కాలం

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

అడుగడుగున ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ ఉమ్మడి పార్టీల ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి , ఎమ్మెల్యే అభ్యర్థి చల్లారామచంద్రారెడ్డి ఎన్నికల బహిరంగ సభ గోకుల్‌ సర్కిల్‌లో నిర్వహించారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి సభకు జనసమీకరణ చేపట్టారు. కానీ అనుకున్న మేరకు జనం రాకపోవడంతో జనాన్ని ఆకట్టుకునేందుకు వాహనాలతో తరలించారు. బాణసంచాలు, డిజె పాటలు పెట్టి మధ్యం, భోజనం ఆశ చూపినా ఫలితం లేకపోయింది. భోజనం రుచిగా లేదంటు పడేసి వెళ్లిన సంఘటన సోమవారం తెలుగుదేశం ప్రచారంలో జరిగింది.

 

 

జనం లేకనే కిరణ్‌ కట్టుకథలు….

స్థానిక గోకుల్‌ సర్కిల్‌లో సభకు జనం లేకపోయిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలను ఆకట్టుకునేందుకు ఎంత ప్రయత్నించిన స్పందన రాలేదు. తొలుత చల్లా రామచంద్రారెడ్డి ప్రసంగిస్తుండగా జనం వెళ్ళిపోతుండటంతో కిరణ్‌కుమార్‌రెడ్డి తీసుకుని మాట్లాడారు. ఈ సమయంలో మంత్రి పెద్దిరెడ్డిపై పలు విమర్శలు చేశారు. పాల దోపిడి చేస్తున్నారని ఆరోపిస్తూ ఒకొక్క ఆవు నుంచి వచ్చే పాలను రోజుకు రూ.150లు చొప్పున పాలు వేయగా, ఏటా రూ.54 వేలు, ఇలా నాలుగేళ్లకు రూ.2.16 లక్షలు దోపిడి చేస్తున్నారని ఆరోపించారు. సభలోనే దీనిపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు.ఆవు నాలుగేళ్లు పాలు ఇస్తుందా…ఇదేంటి కిరణ్‌ ఇలా మాట్లాడుతున్నారంటు గుసగుసలాడటంతో నవ్వులపాలైంది.

 

దేశం షో…

దేశం అభ్యర్థి చల్లాబాబు బాలాజి  థీయేటర్‌ నుంచి పట్టణంలోని ప్రధాన రహదారి ఎంబిటి రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. గంటలకొద్ది జనం రాకపోవడంతో ర్యాలీని నిదానంగా కొనసాగించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించి కోడ్‌ ఉల్లంఘించారు. బస్సులు రాకపోవడం, ఆటోలు, కార్లను పోలీసులు వెళ్లనివ్వకపోవడంతో ప్రజలు తమ అవసరాలు తీర్చుకునేందుకు అవస్థలు పడాల్సి వచ్చింది. పలువురు శాపనార్థాలకు గురికావాల్సి వచ్చింది. ర్యాలీకి జనం రాకపోవడంతో ముందుగా బాణసంచాలు భారీ స్థాయిలో పేల్చారు. అలాగే డిజె పాటలు, కార్యకర్తల డ్యాన్సులతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ర్యాలీని తీసుకొచ్చిన వారి వాహనాలు పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ ఆపివేయడంతో ట్రాఫిక్‌కు ఇబ్బందిగా మారింది. ర్యాలీకి వచ్చిన జనానికి స్థానిక ఆర్టీసి బస్టాండ్‌లో షామియానాలు వేసి భోజనాలు ఏర్పాటు చేశారు. మండుటెండలో తాగునీరు లేక, భోజనం రుచిగా లేకపోవడంతో ప్రజలు తినకుండ పడేశారు.

మధ్యం పంపిణీ…

తెలుగుదేశం పార్టీ ర్యాలీ కోసం తీసుకొచ్చిన వారికి మధ్యం, నగదు పంపిణీ చేశారు. ఒకొక్కరికి రూ.300 లు , భోజనం, మందుబాటిలు అందజేశారు. పలువురు మధ్యం కోసం దుకాణాల వద్దకు తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకుని వెళ్లి కొనుగోలు చేసి తాగారు.

 

5 నామినేషన్లు దాఖలు…

పుంగ నూరు ఎమ్మెల్యే పదవికి సోమవారం 5 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆర్‌వో మధుసూదన్‌రెడ్డి తెలిపారు. తెలుగుదేశం అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి చల్లా సుప్రియ, కుమారై చల్లా పూజారెడ్డి మూడు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే కాంగ్రెస్‌ తరపున జి.మురళిమోహన్‌, ఎస్‌డిపీఐ పార్టీ తరపున షేక్‌ జమీర్‌ నామినేషన్లు దాఖలు చేశారు.

Tags: Janam Nai to Nallari Sabha… Violation of Telugu Desam Code

Post Midle