తెలంగాణలో పోటీపై 16న  జనసేన క్లారిటీ

Janañana Clarity on Telangana Contest 16

Janañana Clarity on Telangana Contest 16

Date:11/10/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పవన్ కల్యాణ్ పార్టీ పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో జనసేన పరిస్థితి ఎలా ఉండబోతోంది. ప్రస్తుతానికి అయితే.. ఇప్పటిదాకా ముందస్తు ఎన్నికల్లో పోటీచేసేది లేనిది పవన్ ఇదమిత్థంగా తేల్చి చెప్పలేదు. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో తిరుగుతున్న ఆయన 16వ తేదీన తె-జనసేన మీటింగ్ పెట్టుకున్నారు.కార్యకర్తలందరితో సమావేశమై.. ఆ రోజున ఎన్నికల్లో పోటీచేసే సంగతి డిసైడ్ చేస్తాం అని ఆయన అంటున్నారు. అందుకే ఇప్పుడు తెలంగాణలోని జనసేన కార్యకర్తలు, పవన్ నే నమ్ముకుని ఉన్నవారు… అంతా 16వ తేదీకోసం ఎదురుచూస్తున్నారు.
పవన్ మీద కోటి ఆశలు పెట్టుకుంటున్నారు.జనసేన పార్టీని పవన్ కల్యాణ్ 2014 ఎన్నికలకు ముందే ప్రారంభించారు. అంతకు ముందు నుంచి కూడా పవన్ అభిమానులుగా, ఆయన వద్ద వ్యక్తిగతంగా గుర్తింపు ఉన్న అనేక మంది.. ఆయన పార్టీలో చేరారు. వీరిలో తెలంగాణకు చెందిన నాయకులు కూడా అనేక మంది ఉన్నారు. పవన్ పార్టీని యాక్టివేట్ చేయగానే.. తమకు రాజకీయంగా ఒక భూమిక ఏర్పడుతుందని వారంతా కలలుకన్నారు.తీరా ఆ ఎన్నికల్లో పవన్ పాల్గొనలేదు.
చంద్రబాబు, మోడీకోసం ప్రచారం మాత్రం చేశారు. దాంతో ఆయన పార్టీలో అప్పటికి చేరినవారు, అప్పటికే యాక్టివ్ గా ఉన్నవారు అంతా ఖంగుతిన్నారు. సర్లే.. ఈ మైత్రి వల్ల మరో అయిదేళ్ల తర్వాతనైనా ఏదో అవకాశం దక్కకపోతుందా అని నిరీక్షిస్తూ పవన్ పంచనే ఉండిపోయారు. వీరిలో పలువురు తెలంగాణ నాయకులు కూడా ఉన్నారు.కానీ, వారు లెక్క వేస్తున్న దానికంటె ముందే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు వచ్చేశాయి. సీపీఎం, పవన్ తో పొత్తు పెట్టుకోడానికి విపరీతంగా ఉత్సాహం చూపించింది గానీ.. పవన్ మొగ్గలేదు.
తనంత తాను యాత్ర కొనసాగించుకుంటూ ఉండిపోయారు. ఆయన తెలంగాణ ఎన్నికల్లో దిగరు- అనే పుకారు బాగా వ్యాపించింది. అయితే ఇప్పుడు పవన్ పునరాలోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.16న తెలంగాణ జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం ఏర్పాటుచేసుకున్నారు. ఆ సమావేశంలో ఎన్నికల్లో పోటీసంగతి తేలుస్తారని చెబుతున్నారు. పవన్ సానుకూల నిర్ణయం తీసుకుంటే.. తమకు మనుగడ ఉంటుందని.. లేదంటే.. రాజకీయ అస్తిత్వం కోసం మరో అయిదేళ్లు ఎదురుచూస్తూ ఉండడం కష్టం అని పలువురు భావిస్తున్నారు.
Tags:Janañana Clarity on Telangana Contest 16

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *