రొంపిచెర్ల ముచ్చట్లు:
10 రోజులపాటు కొనసాగుతున్న సభ్యత్వ నమోదు ప్రక్రియలో పెద్ద ఎత్తున జనసేన సభ్యత్వం తీసుకొంటున్న కార్యకర్తలు.ఒక్కో నియోజకవర్గంలో 50 మంది వాలంటీర్లతో కొనసాగుతున్న సభ్యత్వ నమోదు ప్రక్రియ.ఉమ్మడి కూటమి ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ వారి ఆశయ సాధనకు జనసైనికులు పని చేయాలని పుంగనూరు నియోజకవర్గం జనసేన ఇంచార్జి చిన్నరాయల్ పిలుపునిచ్చారు.సమష్టిగా పవన్ కల్యాణ్ ఆశయ సాధన కోసం పని చేద్దాం అంటూ పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ జనసైనికులతో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ను కార్యక్రమం 18.07.2024 తేదీన మొదలు పెట్టి జనసైనికులు,జనసేన నాయకులతో పుంగనూరు నియోజకవర్గం లోని మండలాల వారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటి తో దాదాపు మూడు వేల కు చేరుకొన్నదని పుంగనూరు జనసేన నియోజకవర్గ ఇంచార్జి చిన్నరాయల్ తెలిపారు.జనసేనపార్టీ సభ్యత్వం పొందిన వారిలో ఎవరైనా ప్రమాదం లో గాయపడిన వారికి యాబై వేల నుండి డెబ్భై వేలవరకు ప్రమాద వశత్తు బీమా అలాగే ప్రమాదం లో మరణించిన వారికి ఐదు లక్షల వరకు బీమా వర్తిస్తుందని తెలిపారు.జనసేన సభ్యత్వ ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్, లీగల్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి cv శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు పోకల జనార్ధన్ గారు, జిల్లా కార్యదర్శి జావేద్ భాషా గారు, రొంపిచర్ల మండల అధ్యక్షులు బాబాజాన్, పులిచెర్ల మండలాధ్యక్షులు చంద్రబాబు, పుంగనూరు పట్టణ అధ్యక్షులు మణికంఠ, నాయకులు మునేష్, మనోహర్, మధు, వెంకటేష్, మధుసూదన్, వెంకీ, చంద్ర, జనసేన నాయకులు ,జన సైనికులు అభిమానులు పాల్గొన్నారు.
Tags: Janasena active membership registration program is successful.