Janasena serving food to the people of the flooded area

ముంపు ప్రాంత ప్రజలకు ఆహారం అందిస్తున్న జనసేన

Date:30/11/2020

నెల్లూరు  ముచ్చట్లు

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో తమ ఇళ్లలోకి నీరు చేరి ఆహార, త్రాగునీరు అందక ముంపు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన జిల్లా జనసేన నాయకులు వారందరికీ ఆహారం త్రాగునీరు అందించారు. ఈసందర్భంగా జిల్లా జనసేన నాయకులు గునుకుల కిషోర్ మాట్లాడుతూ విపత్కర ఆపత్కాల సమయాలలో సాటి మానవులకు చేయూత ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో, జిల్లా ఇన్చార్జి మరియు అధికార ప్రతినిధి మనుక్రాంత్ రెడ్డి సూచనలు సలహాల మేరకు మేరకు నెల్లూరు నగరంలోని పరమేశ్వరి నగర్ ప్రాంతంలో ఉన్న సుమారు 200 మంది ముంపు వాసులకు ఆహార పానీయాలు అందించడం జరిగిందన్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించి ప్రతి ఒక్కరూ ఇటువంటి వాతావరణ వైపరీత్యాల సమయాలలో తమ వంతు చేయూత ఇవ్వాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసైనికులు ప్రశాంత్ గౌడ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

పోలీసు కమిషనర్‌ కార్యాలయం వద్ద బీజేపీ ధర్నా

Tags:Janasena serving food to the people of the flooded area

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *