విశాఖ మంత్రికి జనసేనాని టార్గెట్
విశాఖపట్టణం ముచ్చట్లు:
ఏపీలో రాజకీయాలు ఎప్పటికప్పుడు ఊహించని విధంగానే జరుగుతాయి…ఎప్పుడు ఎవరు ఎలా తిట్టుకుంటారో అర్ధం కాదు…ఎప్పుడు ఎలాంటి విమర్శలు చేసుకుంటారో తెలియదు..అసలు రాజకీయం ఎలా ఉంటుందంటే…అధికార వైసీపీ ఏదైనా మంచి పనిచేసిన సరే…దాన్ని కూడా ఏదొక రకంగా విమర్శించడం ప్రతిపక్ష టీడీపీ పనిగా ఉంది…అలాగే వైసీపీ సైతం తాము చేస్తున్న తప్పులు తెలుసుకోకుండా…టీడీపీని తిట్టడం అలవాటు అయిపోయింది…అలాగే వైసీపీలో చంద్రబాబుని తిట్టడానికి కొందరు ప్రత్యేకంగా ఉంటారు…అలాగే పవన్ ని తిట్టడానికి కొందరు ఉంటారు.ముఖ్యంగా మంత్రులు విషయానికొస్తే…గతంలో పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు లాంటి వారు పవన్ ని టార్గెట్ చేసి మాట్లాడేవారు…ఇప్పుడు సీన్ మారింది..గుడివాడ అమర్నాథ్, రోజా లాంటి వారు పవన్ పై విమర్శలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా అమర్నాథ్…పవన్ పై తీవ్ర విమర్శలే చేస్తున్నారు. ఆ మధ్య కూడా పవన్ తో అమర్నాథ్ దిగిన ఫోటోని జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేశాయి. ఇక దానికి కౌంటర్ గా పవనే…తనతో ఫోటో దిగారని చెప్పి అమర్నాథ్ చెప్పుకొచ్చారు…కానీ అక్కడ వాస్తవం వచ్చి అమర్నాథ్…పవన్ తో ఫోటో దిగారు.కానీ అమర్నాథ్ కావాలని సెటైర్ వేశారు…ఇటీవల పవన్ పొత్తు విషయంలో మూడు ఆప్షన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే…దీనిపై కూడా అమర్నాథ్ సెటైర్ వేశారు…పవన్ కు కూడా ఏదైనా మూడు ఉండాలసిందే అంటూ మాట్లాడారు. ఇక ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారో అందరికీ తెలిసిందే.ఇలా పవన్ ని విమర్శిస్తున్న అమర్నాథ్ కు చెక్ పెట్టాలని జనసేన చూస్తుంది…వచ్చే ఎన్నికల్లో అమర్నాథ్ ని ఎలాగైనా అనకాపల్లి బరిలో ఓడించాలని అనుకుంటుంది. అయితే జనసేనకు సింగిల్ గా ఓడించే సత్తా లేదని చెప్పొచ్చు…కానీ టీడీపీతో కలిస్తే మాత్రం అనకాపల్లిలో అమర్నాథ్ కు చెక్ పడిపోతుంది. గత ఎన్నికల్లో టీడీపీపై అమర్నాథ్ 8 వేల ఓట్ల మెజారిటీతో గెలిస్తే…జనసేనకు 12 వేల ఓట్లు వచ్చాయి…అంటే టీడీపీ-జనసేన కలిస్తే అనకాపల్లిలో అమర్నాథ్ పరిస్తితి ఏం అవుతుందో అర్ధం చేసుకోవచ్చు
Tags: Janasena targets Visakhapatnam minister

