Natyam ad

జనసేన భారీ బైకు ర్యాలీ

పెందుర్తి ముచ్చట్లు:


జనసెన ఉమ్మడి రూరల్ జిల్లా అద్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు జగ్గయ్య పాలెం నుండి నరవ, జెర్రిపోతులపాలెం, చింతట్ల ప్రాంతాల్లో భారీ బైక్ చేపట్టారు. ఈ బైక్ ర్యాలీలో జన సైనికులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
రమేష్ బాబు మాట్లాడుతూ ఈ నాలుగు ఏళ్లలో వైసిపి చేసిన ప్రాజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజలకు తెలిసేలా ఎండగట్టడం ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం. టిడిపి, జనసేనా పొత్తు ఎందుకో ప్రజలకు తెలియజేస్తాం. యుద్ధం నువ్వు ప్రకటించడం కాదు నీమీద నీ చెల్లి యుద్ధం ప్రకటించింది, నీ తల్లి యుద్ధం ప్రకటించింది, నీ మీద ప్రజలు యుద్ధం చేస్తున్నారు. నువ్వు అభిమన్యుడి కాదు, అర్జునుడివి కాదు,  నువ్వు ఉత్తర కుమారుడివి. అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు చెల్లిని, తరవాత తల్లిని ఇప్పుడు సిద్ధం పోస్టర్లో తండ్రిని ఫోటోనే ఎత్తేసావ్.  నిన్న నీ సభకు తెలుగు తమ్ముళ్లను, జన సైనికులను అక్రమ అరెస్టులు చేశావ్. మూడు రోజులుగా వ్యవస్థలను వాడుకుని ప్రభుత్వ ప్రైవేటు బస్సుల్లో ప్రజలను తరలించావ్. నీ మాటలకు ప్రజలు తలుచుకుని తలుచుకుని నవ్వుకుంటున్నారు.  ఈ రాష్ట్రానికి పట్టిన చీడవు నువ్వు, రెండు నెలల్లో నిన్ను వదిలించుకోవడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రజలను చైతన్య పరచడానికే ఈ ర్యాలీలు చేపడుతున్నామని అన్నారు.

 

Tags: Janasena’s huge bike rally

Post Midle
Post Midle