Natyam ad

రాష్ట్రవ్యాప్తంగా జనవాణి కార్యక్రమం-నాదెండ్ల మనోహర్

విజయవాడ ముచ్చట్లు:


జనసేన పార్టీ తనపెట్టిన జనవాణి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. భారత దేశం లో ఏ రాజకీయ పార్టీ అందుకోని విధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన తోఈ కార్యక్రమం చేపట్టిందని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. నిన్న తాడేపల్లి లో జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే ఇటువంటి సంఘటన చాలా బాధాకరం. స్పందించే హృదయం లేని వారికి అధికారంలో ఉండే అర్హత లేదు. ముఖ్యమంత్రి  వెంటనే అధికారం నుండి దిగిపోవాలి.  ప్రజల కష్టాలను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు కాబట్టే జనసేన జనవాణి కార్యక్రమం చేపట్టింది. జగనన్న కాలనీల పేరుతో పెద్ద మోసానికి పాల్పడింది ఈ ప్రభుత్వం. నవంబర్ 12,13,14 తేదీ లలో రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలను సందర్శించి అక్రమాలను బయటపెడతామని అయన అన్నారు.18లక్షల 60వేల ఇళ్ళు కట్టిస్తామని చెప్పారు ఆ ఇళ్ళు ఎక్కడ. రైతుల దగ్గర లంచం  తీసుకున్న ఏకైక ప్రభుత్వంగా వైసిపి ప్రభుత్వం చరిత్ర లో నిలిచిపోతుంది. రైతుల దగ్గర తక్కువ రేటుకు భూములు తీసుకుని వాటిని జగనన్న కాలనీలకు ఎక్కువ రేటుకు అమ్ముకుని ఎంపీలు ఎమ్మెల్యేలు బాగుపడ్డారని అయన అన్నారు.

 

Tags: Janavani program across the state-Nadendla Manohar

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.