జనమే శ్వాసగా..! హ్యాట్రిక్‌

Jane is breathing ..! Hat-trick

Jane is breathing ..! Hat-trick

– జిల్లా రాజకీయాల్లో విలక్షణ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
-నియోజకవర్గంలో ఏటా రెండుసార్లు పల్లెబాటతో ఇంటింటికి
-నిత్యం ప్రజల్లోనే ఉంటూ..సమస్యలు పరిష్కరిస్తూ..
-భాస్కర్‌రెడ్డి ట్రస్టు, సొంత నిధులతో అభివృద్ది కార్యక్రమాలు

Date:23/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

జిల్లా రాజకీయ చిత్రపటంలో గడచిన నలబై సంవత్సరాలలో పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలక్షణ నేత. ఏ నేతకు లేని గుర్తింపు దక్కించుకొన్న ఆయనకు జనమే శ్వాస. ఇన్‌స్టంట్‌ రాజకీయాలు సాగుతున్న ఈ రోజుల్లో నిత్యం ప్రజల్లో ఉంటూ..వారి సమస్యలు ఆలకిస్తూ..పరిష్కరిస్తూ కనిపిస్తారు. ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజలే జీవితంగా మార్చుకొని ప్రజానేతగా గుర్తింపు దక్కించుకోవడం వెనుక ఆయన కఠోర శ్రమ, కృషి ఉంది. అదే అయన్ను జిల్లాలో తిరుగులేని నేతగా చేసింది. పుంగనూరులో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎంపికై హ్యాట్రిక్‌ సాధించారు.

ప్రతిసారి పెరిగిన మెజార్టీ …

రామచంద్రారెడ్డి తొలిసారిగా 2009 లో 40,727 వేల ఓట్లు మెజార్టీ సాధించి, పుంగనూరులో అడుగు పెట్టారు. ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎంపికైయ్యారు. అలాగే 2014 ఎన్నికల్లో 31,731 ఓట్లు మెజార్టీతో వైఎస్సార్సీపి తరపున రెండవ సారి పోటీ చేసి గెలుపొందారు. అలాగే ఈ సారి ఎన్నికల్లో 47,208 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొంది హాట్రిక్‌ సాధించారు. జిల్లాలో తిరుగులేని లీడర్‌గా పేరుగాంచారు.

ఏటా జనం మధ్యేనే…..

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిత్యం జనంలో ఉంటూ వారి సమస్యలు వింటూ, పరిష్కరిస్తూ వెళ్లడమే దినచర్య. వేకువజాము నుంచి ఎంతరాత్రై నా జనం కోసమే ఉంటారు. పార్టీపరంగానైనా, ప్రభుత్వ కార్యక్రమాలతో సంబంధం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పుంగనూరు నియోజకవర్గంలో మున్సిపాలిటితో పాటు ఆరు మండలాలు ఉన్నాయి. అవి పుంగనూరు మున్సిపాలిటిలో 24 వార్డులు ఉన్నాయి. అలాగే పుంగనూరు , చౌడేపల్లె, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలు కలవు . వీటిలో 106 పంచాయతీలు, 876 గ్రామాలు ఉన్నాయి. ఏడాది రెండుసార్లు పల్లెబాట పేరుతో ప్రతిపల్లెకు వెళ్లి జనంతో మమేకమవుతారు. ఒక్కో పల్లెను రెండుసార్లు ఈ కార్యక్రమం ద్వారా సందర్శిస్తే..అధికారిక, పార్టీ కార్యకర్తలు, ప్రజల ఆహ్వనం మేరకు సాగించే పర్యటనలతో ఏడాదంతా ప్రజలతో నడిపేస్తారు. ఈ పర్యటనల్లో పెద్దిరెడ్డి అందరిలో సామాన్యడిలా కలిసిపోతారు. ఎవరు ఏమి చెప్పినా ఆలకించడం ద్వారా ప్రజలు తమ సమస్యలు చెప్పుకొంటారు. వ్యక్తి, సామూహిక సమస్యలను వీలైతే ప్రభుత్వ నిధులతో పరిష్కారం చేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే పరిష్కరించిన సమస్యలను అత్యధికంగా భాస్కర్‌రెడ్డి ట్రస్టు ద్వారా సొంత నిధులతో పరిష్కరించినవే .

అయ్యప్పంటే ఎనలేని భక్తి…

ఏడాదంతా ప్రజల్లో ఏలా కలిసివుంటారో భక్తి విషయంలోనూ అంతే. అయ్యప్పస్వామి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అచంచలమైన భక్తి విశ్వాసాలు. తన స్వగ్రామమైన సదుం మండలం ఎర్రాతివారిపల్లెలో సుమారు రూ.10 కోట్లు ఖర్చు చేసి, అత్యంత సుందరంగా శ్రీ అయ్యప్పస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో నిత్య పూజలు, అన్నదానాలు కొనసాగిస్తున్నారు. ప్రతి యేటా రెండుసార్లు అయ్యప్పమాల ధరిస్తారు. కఠోరదీక్షతో మాలధారణ ఉంటూ అదే సమయంలో పల్లెబాట నిర్వహిస్తారు. కాలికి చెప్పులు లేకుండా పల్లెల్లో కిలోమీటర్ల దూరం నడుస్తారు.

 

ఇది గొప్ప విజయం

Tags: Jane is breathing ..! Hat-trick

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *