విజయ్ తో జాన్వీ…

Janevi with Vijay ...

Janevi with Vijay ...

Date:26/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
యూత్ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ ఇప్పుడు టాలీవుడ్‌నే కాదు, బాలీవుడ్‌ను కూడా తాకింది. ఆసక్తికరమై విషయం ఏమిటంటే.. ‘ధడక్’ సినిమాతో కుర్రకారు గుండెలు కొల్లగొట్టిన శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ సైతం విజయ్‌కు పెద్ద ఫ్యాన్ అయిపోయింది. అంతేకాదు, తాను మెచ్చే అత్యంత సెక్సీ వ్యక్తి, కలుసుకోవాలనుకునే వ్యక్తి అతనేనని చెప్పేసింది. బుల్లితెరలో పాపులరైన ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఈమె చెప్పిన సమాధానం విని ఆ షో వ్యాఖ్యాత కరణ్ జోహార్ సైతం షాకయ్యాడట. ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నల్లో భాగంగా కరణ్.. ‘‘నీకు అవకాశం వస్తే ఏ ఆకర్షవంతమైన వ్యక్తిని ఎంపిక చేసుకుంటావు?’’ అని అడిగితే.. ‘విజయ్ దేవరకొండ’ అని ఠక్కున సమాధానం చెప్పేసిందట. అతడిలో సెక్స్ అప్పీల్ తనకు నచ్చుతుందని, అతను మంచి ప్రతిభ ఉన్న నటుడు కూడా అని వివరణ ఇచ్చింది జాన్వీ. సాధారణంగా బాలీవుడ్ భామలు సెక్సీ హీరోలు అనగానే రణ్‌వీర్ సింగ్, వరుణ్ దావన్ లేదా సిద్ధార్థ్ మల్హోత్ర వంటి హీరోల పేర్లను చెబుతారు. అయితే, జాన్వీ ప్రత్యేకంగా విజయ్ పేరును చెప్పడం నిజంగా ఆశ్చర్యకరమే. ఈ నేపథ్యంలో త్వరలో జాన్వీ.. విజయ్‌తో జోడీగా టాలీవుడ్‌కు పరిచయం కానుందనే వార్తలు నిజమే అనిపిస్తోంది. ‘ట్యాక్సీవాలా’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న విజయ్‌కు జాన్వీ మాటలు ఇంకా చేరాయో లేదో మరి!!
Tags:Janevi with Vijay …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *