జనవరి 31పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

న్యూఢిల్లీ ముచ్చట్లు:
 
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ప్రసంగించనున్నారు. అనంతరం ఆర్థిక సర్వే జరగనుంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడత బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయి.రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: January 31 Parliament Budget Sessions

Natyam ad