Natyam ad

ముక్కంటి సేవలో జపాన్ దేశీయులు

శ్రీకాళహస్తీ ముచ్చట్లు:


శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం పరదేశీయులు సందడి చేశారు.   కరోనా కారణంగా   గత రెండు సంవత్సరాలుగా విదేశీయులు  రాక తగ్గింది.  ఇప్పుడు ఇప్పుడు కరోనా  తగ్గుముఖం పడుతుండటంతో  జపాన్ చెందిన విదేశీ మహిళలు  శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు అనంతరం వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామి స్వామి అమ్మవార్ల తో పాటు శని భగవానుని ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారు ఇక్కడ ఆలయ శిల్ప కళా సౌందర్యం చూసి ఆనందం వ్యక్తం చేశారు పురాతన కాలంలో నిర్మించిన గోపురాలు ఆలయంలో స్తంభాలపై చెక్కిన శిల్ప కళను చూసి ఆత్మానందాన్ని పొందారు వారి స్నేహితులు చెప్పడంతో ఇక్కడి ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చినట్లు వివరించారు.

 

Tags: Japanese natives in the service of Mukkanti
.

Post Midle
Post Midle