జనసేన ఓటర్లకు గాలం

Jasana voters

– పుంగనూరులో పట్టుబడ్డ రూ.2 వేలు టోకెన్లు
– 5,600 టోకెన్లు స్వాధీనం
– విలువ రూ.1.12 కోట్లు
– రూ.59 వేలు నగదు
– 7 కేసులు నమోదు
– వాహనంతో సహా 14 మంది అరెస్ట్

Date:07/04/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు జనసేన అభ్యర్థి రామచంద్రయాదవ్‌కు ఓట్లు వేయాలని ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి, మభ్యపెట్టే కార్యక్రమాన్ని చే పట్టి, దొరికిపోయిన సంఘటన ఆదివారం పుంగనూరు, చౌడేపల్లెలో జరిగింది. రెండు ప్రాంతాలలోను 5,600 టోకెన్లు తీసుకుని 14 మందిని పోలీసులు అదుపులోనికి తీసుకుని, 7 కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. వీటి విలువ రూ.1.12 కోట్లు. సీఐ నాగశేఖర్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు అసెంబ్లి అభ్యర్థిగా రామచంద్ర యాదవ్‌ పోటీలో ఉన్నారు. ఇలా ఉండగా పోలీంగ్‌ సమీపించడంతో ఎన్నికలలో గెలుపొందేందుకు జనసేన పార్టీ ఓటర్లకు గాలం వేసే కార్యక్రమాన్ని పార్టీ తీవ్రం చేసింది. ఇందులో భాగంగా జనసేన పార్టీ పిఎన్‌జి గ్రూపు పేరుతో జివి అనే పెద్ద అక్షరాలతో రూ.2 వేలు, 2019 అని ముద్రించిన టోకెన్లకు సీరియల్‌ నెంబరును ముద్రించారు. ఈ టోకెన్లను జనసేన కార్యకర్తలు తీసుకుని ఒకొక్క ఓటరుకు ఒకొక్క టోకెన్‌ ఇచ్చి, డబ్బులు తెచ్చుకోమని ఎర వేశారు. నిఘా అధికారులకు సమాచారం అందడంతో స్కాడ్‌ శ్రీనివాసరావు, శివకుమార్‌లు కలసి పుంగనూరు మండలం క్రిష్ణమరెడ్డిపల్లె, బోడినాయునిపల్లె, మంగళంకాలనీ, నల్లరాళ్లగంగమ్మ గుడి, క్రిష్ణుని గుడి వద్ద జనసేన నేతలు ఎల్‌.వెంకటేష్‌, కె.చలపతి, ఎ.రమేష్‌, జి.శ్రీనివాసులు , కె.శివ, కె.నరసింహులు, పి.శివకుమార్‌, డి.బాస్కర్‌ అనే వారు కలసి ఓటర్లను ప్రలోభ పట్టేందుకు డబ్బులను, టోకెన్లను పంపిణీ చేస్తుండగా ఫ్లయింగ్‌స్కాడ్‌ శ్రీనివాసరావు, శివకుమార్‌లు కలసి డబ్బులు , టోకెన్లు పంచుతున్న జనసేన నేతలను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.47 వేలు నగదు, ఓటరులిస్టు, రూ.2 వేల టోకెన్లు 600 లు స్వాధీనం చేసుకుని , పుంగనూరు పోలీసులకు అప్పగించగా , పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేశారు.

చౌడేపల్లెలో….

జనసేన అభ్యర్థి బి.రామచంద్రయాదవ్‌ను గెలిపించాలని పార్టీ నేతలు ఓటర్లకు నిబంధనలకు విరుద్ధంగా ఎర వేసి దొరికిపోయారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సింగిరిగుంట చెక్‌ పోస్టు వద్ద ఎస్‌ఎస్‌టీమ్‌ ఇన్‌చార్జి చంద్రశేఖర్‌ తెలిపిన వివరాలమేరకు పుంగనూరు జనసేన పార్టీ అభ్యర్థి రామచంద్రయాదవ్‌కు ఆర్‌వో అనుమతిచ్చిన స్కార్ఫియో ఏపి:39 హెచ్‌ : 113 నెంబరుగల వాహనంలో టోకెన్లు పుంగనూరుకు చెందిన డ్రైౖ వర్‌ పవన్‌కుమార్‌ తదితరులు సోమలవైపుకు వెళ్తుండగా వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేయగా డ్రైౖ వర్‌ సీట్‌ క్రింద భాగంలో 3,600 కూపన్‌లు ఉన్నట్లు గుర్తించారు. ఈ కూపన్‌ ను తీసుకెళ్ళిన వారికి రూ.2వేలు నగదు ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకొన్న టోకెన్ల విలువ సుమారు రూ.72 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అలాగే చౌడేపల్లె మండలం శెట్టిపేట వద్ద జనసేన కార్యకర్తల వద్ద నుంచి రూ.12 వేలు, 1000 టోకెన్లను పంచుతుండగా పట్టుకున్నారు. అలాగే మండలంలోని ఆమినిగుంట వద్ద రాజేష్‌, రవి అనే జనసేన కార్యకర్తలను పట్టుకుని, వారి వద్ద నుంచి రూ.2 వేలు టోకెన్లు 400 లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.8 లక్షలుగా తెలిపారు. ఈ మేరకు చౌడేపల్లె ఎస్‌ఐ నరేంద్ర కేసు నమోదు చేసి, నింధితులను అరెస్ట్ చేశారు. అలాగే స్కార్ఫియో వాహనాన్ని , టోకెన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు డ్రైౖ వర్‌ పవన్‌కుమార్‌, విజయ్‌కుమార్‌, లక్ష్మిపతి, హేమంత్‌ కుమార్‌, రాజేష్‌, రవిలపై కేసు నమోదు చేశారు. ఈ తనిఖీలలో ఎన్నికల ప్రత్యేక బృందాలు, పోలీసులు ఓడివేలునాయక్‌, బుడ్డానాయక్‌, మంజునాథ్‌ పాల్గొన్నారు.

రాష్ట్రభివృద్ధి జగన్‌తోనే సాధ్యం

Tags: Jasana voters

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *