మల్లె పూలకు రాని ధర

Jasmine price

Jasmine price

Date:23/11/2018
గుంటూరు ముచ్చట్లు:
మల్లెపూల సాదారణకాపు సమయం మించి పోయి దిగుబడి తక్కువగా వస్తుంది. కార్తీకమాస ప్రత్యేక సందర్భంలో దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ ధరలు ఆకాశాన్నంటుతుండటంతో రైతులకు కాసులు పూయిస్తున్నాయి. కార్తికమాస ప్రత్యేక కార్యక్రమాలకు తరుణులు మల్లెపూలపై మక్కువ చూపుతున్నారు. దీంతో మల్లెపూల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఈ ధరలు ఏడాదిలో ప్రత్యేకంగా కార్తీక మాసంలో తప్ప మళ్లీ మళ్లీ రావని రైతులు, వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.గుంటూరు, ప్రకాశం జిల్లా సరిహద్దులోని వెదుళ్ళపల్లి పూలమార్కెట్‌ పూలవిక్రయాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంత గరువు నేలల్లో విద్యుత్‌ మోటర్లపై పూలతోటల సాగుతో వెదుళ్ళపల్లి ప్రాంత పూలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సీజన్ల వారీగా మల్లెపూల తర్వాత బంతి, చామంతి, కారబ్బంతి వంటి పూలు సాగుచేస్తుంటారు. ఏడాది పొడవునా సాగయ్యే కనకాంబరం, మరువం, లైనాకు ఇక్కడ సాగుచేస్తుంటారు. ఈ ప్రాంతంలో సాగు లేని సమయాల్లో బెంగళూరు ప్రాంతం నుండి బంతి, చామంతి ఇతర పూలను దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయిస్తుం టారు.
పూల విక్రయాలకు అత్యంత ప్రాధాన్యత గల వెదుళ్ళపల్లి పూలమార్కెట బాపట్ల, చీరాల జాతీయ రహదారి మార్గంలో ఉంది. దీనికి తోడు చెన్నై, విజయవాడ, ప్రధాన రైలు మార్గంలో స్టువర్టుపురం సిగలింగ్‌ రైల్వే స్టేషన్‌ ఉండడంతో దూరప్రాంత పూల వ్యాపారులు రైళ్ళు, బస్సుల ద్వారా వెదుళ్ళపల్లికి వచ్చి పూలు కొనుగోలు చేస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత గల ఈ ప్రాంత పూల రైతుల్ని ఉద్యాన శాఖ పట్టించుకోదు. కనీసం పూలతోటలకు ఆశించు చీడపీడల నివారణకు సలహాలిచ్చేందుకు ఉద్యాన శాఖ అందుబాటులో లేకపోవడంతో పూల తోట సాగు రైతులు కొంతమేర నష్టాల బారిన పడుతున్నారు. పొన్నూరులో ఉన్న ఉద్యాన శాఖ అధికారి కార్యాలయాన్ని బాపట్లలో ఏర్పాటు చేసి ఈ ప్రాంతపూలతోటల రైతులకు చీడపీడల నివారణ సలహాలతో పాటు ప్రభుత్వం నుండి అందజేసే రాయితీలు అందజేయాలని వారు కోరుతున్నారు.
బాపట్ల మండలం స్టువర్టుపురం, బేతపూడి వెదుళ్లపల్లి, కొత్తపాలెం , పోతురాజు కొత్తపాలెం, ఆశోదివారిపాలెం, మరుప్రోలువారిపాలెం పట్టణ పరిధిలోని మూర్తి రక్షణ నగర్‌, జిల్లా సరిహద్దులోని కావూరివారిపాలెం , తులసీనగర్‌, చీరాల ఆటో నగర్‌ ప్రాంతాల్లో అధిక విస్తీర్ణంలో సన్న, చిన్నకారు రైతులు అనాదిగా వివిధ పూల తోటలను సాగుచేస్తున్నారు. ఈ సాగులో మహిళలే ప్రధాన భూమిక నిర్వహిస్తారు. పూల కోత, అమ్ముకోవడం లో కూడా మహిళలే అధికంగా శ్రమ పడుతుంటారు.
సాధారణంగా జనవరి నెల నుండి మల్లెతోటలను ఈ ప్రాంత పూలతోటల రైతులు మల్లెపూల తోటలను సిద్ధం చేస్తారు. సీజన్లో ఈ ప్రాంతం నుండి టన్నుల కొద్ది మల్లెపూలు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. సీజన్లో వచ్చే మల్లెపూలకు దళారులు నిర్ణయించిన ధరకే మల్లెపూలను అమ్ముకోవాలి. దళారుల బెడద నుండి కొంతమంది మహిళా రైతులు నేరుగా విక్రయిస్తుంటారు.
దూరప్రాంతం నుండి ఇక్కడికి అనేక ప్రాంతాల నుండి వ్యాపారులు వెదుళ్ళపల్లి పూల మార్కెట్‌కు వస్తుంటారు.ప్రస్తుతం మల్లెసాగుకు సీజన్‌ కాకపోవడంతో వందల కిలోలు ఉత్పత్తయ్యే మల్లెలు కేవలం పదుల కిలోలకు మించడం లేదు. సీజన్లో రూ. 100 నుండి 120 వరకు మించని మల్లెల ధర అడపాతడపా వస్తున్న మల్లెపూలు కార్తికమాసం ఆదివారం ఆరంభం నుండి కిలోధర అమాంతంగా రూ. ఐదు నుండి ఆరేడు వందలకు పలుకు తుంది. దీంతో మహిళా రైతులు సంబరపడుతు న్నారు.
ఈ యేడు వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో ఇప్పటివరకు మల్లెపూలు పూస్తూనే ఉన్నాయి. సాగుచేసే విధానంలో కొంత భాగాన్ని ఎండగట్టి మరికొంత భాగాన్ని సాగులోకి తెచ్చి ప్రయోగాత్మకంగా నూతన పద్ధతులతో మల్లె తోటల సాగుతో లాభాల పంట పండించొచ్చని రైతులు మల్లె తోటల సాగులో కొత్త విధానాలతో ముందుకు వెళ్తున్నారు.
Tags:Jasmine price

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *