మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి హజరయిన మంత్రి జవహర్

Jawahar, who is attending a spiritual blend of ours

Jawahar, who is attending a spiritual blend of ours

Date:26/11/2018
నరసాపురం ముచ్చట్లు:
బడుగు బలహినవర్గాలకు మంచి గుర్తింపు వచ్చినా, సముబిత స్థానాలు లభించినా, ఆనాడు స్వర్గీయ నందమూరి తారకరామారావు, ఈనాడు చంద్రబాబు నాయుడుదే ఘనత అని, రాష్ట్ర ఎక్సైజ్ శాఖమంత్రి జవహార్ అన్నారు. స్థానిక టైలరు హైస్కూలు గ్రౌండు, జై రాజేంద్ర లయన్స్ క్లబ్ కళ్యాణ మండపం లో మాదిగల అత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి అయన హజరయ్యారు. ఈ కార్యక్రమానికి  పాయకరావుపేట శాసన సభ్యురాలు వంగలపేడి అనిత, శాసన సభ్యుడు బండారు మాధవనాయుడు కుడా హజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ 1983 సంవత్సరం ముందు ఒకటే పార్టీ,  ఒక్కటే కులం,  అన్న నందమూరి తారక రామారావు అధికారంలో కి వచ్చిన  తరువాత అన్నికులాలకు ముఖ్యంగా బడుగు బలహిన వర్గాలు వారికి సముచిత స్థానాలకు వచ్చి అందరికి న్యాయం జరిగింది అని అన్నారు. గ్రూపు సర్వీసులో మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఇటు రాజకీయ రంగంలో మంచి పదవులు వచ్చాయని మంత్రి అన్నారు. కుల వృత్తి చేసుకుంటే తప్పుకాదు  ఉపాధి కొరకు వృతి చేసుకున్నా మంచి మార్గం ఎన్నుకోవాలి.  మంచి మార్గం లో నడవాలని మంత్రి అన్నారు. నేను స్వయంగా చెప్పులు కుట్టుడం నేర్చుకున్నాను, చదువుకున్నాను, ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది  ఈరోజు రాష్ట్రమంత్రిని అయ్యాను.అన్ని కులాలను, మతాలను గౌరవించి నపుడే మనం కులం మతానాకి అదే గౌరవం దక్కతుందిఅన్నారు . ప్రతి ఒక్కరు కష్టపడాలి. పిల్లలను బాగా చదివించాలి. ప్రభుత్వ పథకాలని సద్వినియోగం చేసుకోవాలి. సమాజనికి కొంత సేవ చేయలని మంత్రి అన్నారు.
Tags:Jawahar, who is attending a spiritual blend of ours

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *