మంచి నీటి కొళాయిలను ప్రారంభించిన జయ మనోజ్ రెడ్డి

ఆదోని  ముచ్చట్లు:
మండిగిరి గ్రామ పంచాయితీ లోని భరత్ నగర్లో 15 సంవత్సరాల నుండి తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో నీటి సమస్యను కాలనీవాసులు ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా సమస్యను పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.వెంటనే మండిగిరి ఇంఛార్జి శేషి రెడ్డి పైపులైన్లు దగ్గరుండి వేయించి నీటి సమస్య త్వరగా పరిష్కారం అయ్యేలా చేశారు బుధవారం  ఆదోని వైసిపి  యువ నాయకులు వై. జయ మనోజ్ రెడ్డి  మంచి నీటి కొళాయిలను ప్రారంభించారు. అనంతరం జయ మనోజ్  రెడ్డి మాట్లాడుతూ 14.65 లక్షలతో పైప్ లైన్లు వేసి మంచి నీటి కొళాయి లను ఏర్పాటు చేయడం జరిగిందని కాలనీవాసులు మరికొన్ని కొళాయి లను వేయించాలని ఆడుగుతున్నారని త్వరలోనే మంచి నీటి కొలాయిలను  ఏర్పాటు చేసి రోడ్లు డ్రైనేజీలు కరెంటు సమస్యలు లేకుండా సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు కాలనీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. కాలనీలో ఏ సమస్య ఉన్న మండిగిరి ఇంచార్జ్ శేషి రెడ్డి దృష్టికి తీసుకొని వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు, అనంతరం కాలనీ వాసులు జయ మనోజ్ రెడ్డి కి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండిగిరి వైకాపా నాయకులు కార్యకర్తలు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:Jaya Manoj Reddy who started good water taps

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *