తంబళ్లపల్లి టిడిపి జనసేన ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థిగా జయచంద్ర రెడ్డే

–వదంతులు నమ్మకండి… అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించాలి..
— అన్నమయ్య జిల్లా అధ్యక్షులు చెర్తి జగన్మోహన రాజు..

-ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి..

 

మదనపల్లె ముచ్చట్లు:

 

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా దాసరిపల్లె జయచంద్రారెడ్డిని ఖాయం చేసినట్లు రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు చమర్థి జగన్ మోహన్ రాజు, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి స్పష్టం చేశారు.గురువారం అన్నమయ్య జిల్లా మదనపల్లి లోని టిడిపి పార్లమెంట్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పలు రకాలుగా సర్వే నిర్వహించి జయచంద్రారెడ్డి సమర్థుడని, ఆయనే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డిపై గెలవడం ఖాయమని ఆయనకే టికెట్ కేటాయించారన్నారు. కానీ కొంతమంది స్వార్థపరులు జయచంద్ర రెడ్డికి పెద్దిరెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు.

 

 

తంబళపల్లి నియోజకవర్గ టిడిపి శ్రేణులు వీటిని నమ్మవద్దని కోరారు. తంబళ్లపల్లె అభివృద్ధి చేయడం , అక్కడ అరాచక పాలన పోవాలంటే జయచంద్రారెడ్డిని గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ను చంద్రబాబు పిలిపించుకొని సముదాయించారని, పార్టీ అధికారంలోకి వస్తూనే శంకర్ యాదవ్ కు సమచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. త్వరలో శంకర యాదవ్ సహకారంతో జయచంద్రారెడ్డి ప్రచారం చేసేలా చర్యలు చేపడతామన్నారు.

 

 

పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు జగన్మోహన్రాజు మాట్లాడుతూ అన్ని విధాల సర్వే నిర్వహించి, అందరికీ ఆమోదయోగమైన వ్యక్తి జయ చంద్రారెడ్డి అని తేలడంతో చంద్రబాబు ఆయనకే తంబళ్లపల్లె టికెట్ కేటాయించాలన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించి జయచంద్రారెడ్డి గెలుపుకు కృషి చేయాలని కోరారు.తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చంద్రబాబు, రాజంపేట పార్లమెంటరీ నాయకులు ఆర్జే వెంకటేష్, దొర స్వామి నాయుడు, ఎస్ఏ మస్తాన్, బీసీ నాయకులు శ్రీరాములు, మాజీ సర్పంచి పటాన్ ఖాదర్ ఖాన్, హోటల్ శంకర్, రెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Jayachandra Redde is the joint candidate for Tamballapally TDP Janasena MLA

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *