Jayaho Amravati

జయహో అమరావతి

Date:22/10/2020

అమరావతి  ముచ్చట్లు:

రాజధాని గ్రామాల నుంచి ఉద్ధండరాయని పాలెం గ్రామానికి పాదయాత్ర గా రైతులు, మహిళలు చేరుకున్నారు. ప్రధాని మోడీ అమరావతి అభివృద్దికి శంకుస్థాపన చేసిన ప్రదేశంలో సర్వమత ప్రార్ధనల నిర్వహించారు. అమరావతి కోసం ప్రాణాలు కోల్పోయిన అమరావతి అమరవీరులకు నివాళులు అర్పించారు.  జయహో అమరావతి అంటూ మహిళలు పెద్ద ఎత్తున  నినదించారు. వివిధ గ్రామాల నుంచి మట్టి, నదీ జలాలను  కలశాలతో తెచ్చారు. అమరావతి శంకుస్థాపన సమయంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇదే విధంగా పవిత్ర జలం, మట్టి తెచ్చిన విషయం తెలిసిందే. ఐదేళ్ల క్రితం ఇదే ప్రాంతం లో అమరావతి కోసం  మోడీ ఇలా శంకుస్థాపన చేసారని మహిళలు గుర్తు చేసారు. మోడీ ఉంచిన మట్టి పైనే.. గురువారం మళ్లీ మట్టి, జలాలు పోసి పై పూజలు చేసారు.

జవహర్‌అలి జన్మదిన వేడుకలు

Tags: Jayaho Amravati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *