మంగళగిరి మండలం, యర్రబాలెం లో జయహో హిందూ- ముస్లిం ఏక్ హో సమావేశం.

మంగళగిరి ముచ్చట్లు:
 
తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెం రామాలయం సెంటర్ లో ఈనెల 20 వ తేదీ గురువారం అనగా రేపు ఉదయం 11 గంటలకు జై భారత్ ఆధ్వర్యంలో జయహో హిందూ- ముస్లిం ఏక్ హో సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షులు బకియతుల్లాహ్ బుధవారం తెలిపారు.హిందూ- ముస్లిం సమైక్యతా దినోత్సవాలలో భాగంగా ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కావున ఈ సమావేశానికి గ్రామంలోని హిందూ- ముస్లిం సోదరులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.సమావేశానికి హాజరయ్యే వారు తప్పనిసరిగా మాస్కు ధరించి రావడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించాలని బకియతుల్లాహ్ విజ్ఞప్తి చేశారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Jayaho Hindu-Muslim Ek Ho Conference in Mangalagiri Zone, Yarrabalem.

Natyam ad