స్వామి వివేకానందుని జయంతి వేడుకలు

Jayanti Celebrations in Swami Vivekan

Jayanti Celebrations in Swami Vivekan

– పట్టణంలో భారీ ప్రదర్శన

Date:12/01/2019

పుంగనూరు ముచ్చట్లు:

స్వామివివేకానందుని జయంతిని పురస్కరించుకుని వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో వివేకానందుని చిత్రపటాన్ని ఊరేగిస్తూ జాతీయ పతాకాన్ని పట్టుకుని ప్రదర్శన చేశారు. సంఘ సలహాదారులు డాక్టర్లు శివ, శరణ్‌ , త్రిమూర్తిరెడ్డి ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు కుంచకుమార్‌, శరత్‌, ప్రకాష్‌, సతీష్‌, కుమార్‌, ఇంతియాజ్‌, గిరిధర్‌, వెంకటేష్‌ ,కుమార్‌, భానుప్రసాద్‌, దీపక్‌ వారి స్నేహితులు కలసి పట్టణంలో మోటారుసైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. అలాగే పట్టణ పురవీధుల్లో జాతీయ పతాకంతో ప్రదర్శన నిర్వహించి, వివేకానందుని ఆశయాలను కాపాడాలని నినాదాలు చేశారు. సుమారు 300 మంది యువకులు వివేకానంద సంఘం టీషర్టులు ధరించి, పురవీధుల్లో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా గోకుల్‌ సర్కిల్‌లో మానవహారం నిర్వహించారు. వివేకానందుని జయంతి వేడుకలు పట్టణంలో మునుపెన్నడు లేని విధంగా నిర్వహించడంతో పట్టణ ప్రజల్లో నూతనోత్సాహం పెల్లుబికింది. ఈ సందర్బంగా డాక్టర్‌ పి.శివ మాట్లాడుతూ వివేకానందుని ఆశయాలను కాపాడేందుకు పుంగనూరు యువత ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. సేవా కార్యక్రమాలలో వివేకానంద సంఘ సభ్యుల కృషి ప్రశంసనీయమన్నారు. ట్రాఫిక్‌ తీవ్రంగా స్తంభించడంతో పోలీసులు క్రమబద్దీకరించారు. ఈ కార్యక్రమాలలో మహేష్‌, విజయ్‌, నాగరాజు, శ్రీనాథ్‌, దివాకర్‌, హరి, ప్రవీన్‌, జగదీష్‌, రంజిత్‌, గౌతమ్‌, గంగామహేష్‌, మురళి, గంగాధర్‌, బార్గవ్‌, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏపీ కమలానికి పోటీ

 

Tags: Jayanti Celebrations in Swami Vivekan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *