వైఎస్సార్‌సీపీ అధ్యక్షులుగా జయరాం, చెంగారెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
వైఎస్సార్‌సీపీ మున్సిపాలిటి, మండల పార్టీ అధ్యక్షులను నియమిస్తూ శుక్రవారం రాత్రి రాష్ట్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటి పట్టణ అధ్యక్షుడుగా గంగారపు జయరాంను నియమించారు. అలాగే మండల అధ్యక్షుడుగా కొత్తపల్లె చెంగారెడ్డిని నియమించారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు నియామకాలు జరిగాయి. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన అధ్యక్షులు మాట్లాడుతూ పార్టీలో ఎలాంటి విబేదాలకు తావులేకుండ అందరి సహకారంతో పార్టీ విధివిధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీకి అత్యధిక ఓట్లు సాధించేందుకు కృషి చేస్తామన్నారు. నూతన అధ్యక్షులను పలువురు అభినందించారు.

Tags: Jayaram and Chengareddy as presidents of YSRCP
