జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ మసూద్ బతికే ఉన్నాడు

Jayshi Mohammad terrorist organization Masood Bati

Jayshi Mohammad terrorist organization Masood Bati

Date:07/03/2019
లాహోర్ ముచ్చట్లు:
బాలాకోట్‌పై భారత్ జరిపిన వైమానిక దాడుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత హతమయ్యాడని కొందరు, అనారోగ్యంతో శనివారం చనిపోయాడనే ప్రచారం సాగింది. అయితే, ఇవి కేవలం గాలి వార్తలేనని, అతడు ప్రాణాలతో ఉన్నాడనడానికి ఈ ఆడియోనే సాక్ష్యం. మసూద్ అజార్ కొడుకు, సోదరుడ్ని పాకిస్థాన్ ప్రభుత్వం అదుపులోకి తీసుకున్న మర్నాడే తన పేరుతో ఓ ఆడియో విడుదల చేశాడు. తాను సజీవంగానే ఉన్నానని, దేవుడికి భయపడండి అంటూ అధికారులను హెచ్చరిస్తూ బుధవారం విడుదలైన ఆ ఆడియో క్లిప్‌లో పేర్కొన్నాడు. తమ భూభాగంలో జైషే మహ్మద్ ఉనికే లేదని ఖండిస్తూ పాక్ ప్రకటించిన తర్వాత రోజే ఈ ఆడియో విడుదల చేయడం గమనార్హం. మసూద్ అజార్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని.. అతడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ వారం కిందట ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో వెల్లడించగా, దీనికి భిన్నంగా పాక్ ఆర్మీ బుధవారం స్పందించింది.
పుల్వామా ఆత్మాహుతి దాడికి తామే పాల్పడిన జైషే మహ్మద్ చేసిన ప్రకటన పాక్ భూభాగం నుంచి కాదని, ఎందుకంటే దానికి ఉనికి తమ దేశంలో లేదని ఇదే అంశాన్ని ఐరాస, పాకిస్థాన్‌లు చెప్పిన విషయం తెలుసుకోవాలని పాకిస్థాన్ సైన్యం అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ వ్యాఖ్యానించాడు. అజార్ తనయుడు హమాద్ అజార్, సోదరుడు ముఫ్తీ అబ్దుల్ రౌఫ్‌లను పాక్ అదుపులోకి తీసుకున్న మరుసటి రోజే గఫూర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విశేషం. మసూద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతడు ఇంటి నుంచి కదల్లేని స్థితిలో ఉన్నాడంటూ గతవారం మీడియా ప్రతినిధుల అడిగిన ప్రశ్నకు మంత్రి ఖురేషీ సమాధానం ఇచ్చారు. అంతేకాదు, అతడు నేరానికి పాల్పడినట్టు సరైన ఆధారాలు చూపితే పాక్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కన్నాడు. కానీ, ప్రస్తుతం మసూద్ విడుదల చేసిన ఆడియో క్లిప్‌ను బట్టి చూస్తే అతడు చాలా ఆరోగ్యంగానే ఉన్నాడని అర్థమవుతోంది. మసీదులు, మదర్సాలు, ముజాయిద్దీన్‌ల పట్ల హింసాత్మక ధోరణి వదిలిపెట్టాలని, ముస్లింల కోసం పోరాడేవారికి అల్లాహ్ కరుణ ఉంటుందని మసూద్ హెచ్చరించాడు.
అంతేకాదు ప్రపంచమంతా తాను చనిపోయానని అనుకుంటోంది.. తాను ఎంత వరకు జీవించాలనేది భగవంతుడు నిర్ణయిస్తాడు.. ఇందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. ఈ ఆడియో క్లిప్‌ను సోమవారం రికార్డు చేసినట్టు అందులోని మాటలను బట్టి అర్థమవుతోంది. ‘ఈ రోజు 4 మార్చి 2019. రోజు ముగిసింది.. మంగళవారం రాత్రి ముందుంది.. మీరు నా మాటలు విన్నప్పుడు నేను సజీవంగా ఉంటానని అనుకుంటున్నాను’ అని ముగించాడు. ఈ ఆడియో క్లిప్ విడుదలకు ముందు రోజే మసూద్ సోదరుడు, తనయుడితో సహా వివిధ ఉగ్రవాద సంస్థలకు చెందిన 44 మందిని పాక్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది.
నిషేధిత ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకుంటున్నామని, ఇది మరో రెండు వారాలు కొనసాగుతుందని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వెల్లడించారు. మరోవైపు, ఉగ్రవాదంపై చర్యలు తీసుకునే విషయంలో తమపై ఎవరి ఒత్తిడి లేదని, తమ భూభాగం నుంచి ఉగ్రమూలాల్ని సమూలంగా నాశనం చేస్తామని గఫూర్ పేర్కొన్నారు.
Tags:Jayshi Mohammad terrorist organization Masood Bati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *