Natyam ad

బిక్షాటన చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి

అనంతపురం ముచ్చట్లు:

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీలో కొన్ని వాహనాలు మూలన పడటంతో పట్టణంలో చెత్త సేకరణ తదితర సమస్యలు నెలకొన్నాయి.  మున్సిపల్ ఛైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి  వాటిని వెంటనే మరమ్మత్తులు చేయాలని భావించారు. దీనికి మున్సిపల్ కమీషనర్ జబ్బార్ మియా స్పందించక పోవటంతో, ఛైర్మన్ జెసి రోడ్డు బాట పట్టడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే నేడు బుధవారం తాడిపత్రి పట్టణంలో భిక్షాటన కార్యక్రమం చేపట్టాలని వాటికి తెదేపా కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు సిద్దం కావాలని సూచించగా, ఆయన ఇంటికి అందరూ చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఉదయాన్నే భిక్షాటనను పోలీసులు అడ్డుకునేలా ఉదయాన్నే జెసి నివాసాన్ని చుట్టుముట్టారు. రెండంచెల భద్రత మద్యలో ఆయన భిక్షాటన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి పోలీసులు పెద్ద సంఖ్యలో జెసి నివాసం చేరుకున్నారు. మరమ్మత్తులు నోచుకోని వాహనాలను తాము భిక్షమెత్తి గాని, రిపేరీ చేయిస్తానని, అంతేకాని, మరమ్మత్తులు పేరిట టెండర్లు నిర్వహిస్తే ఒప్పుకోనని, ఈ విషయాలన్ని ప్రజలకు తెలియజేయడం కొరకే, తాను నేడు ఈ భిక్షాటన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు జెసి తెలిపారు. ఒక సందర్బంలో అడ్డుకున్న పోలీసులు తమను ఎందుకు అడ్డుకున్నారో సమాధాన పత్రం ఇవ్వాలని అడిగారు. అంతేకాకుండా, ఇందులో మీ పాత్ర ఏమి లేదని, పాపం పోలీసులు అని మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జనవరి ఒకటో తేదీ లోపల అధికారుల తీరు మారకపోతే, తామే ముందుండి తమ స్వంత నిధులను వెచ్చించి, పట్టణ ప్రజలకు సేవలు చేయడానికి ముందుంటానని తెలిపారు. రాష్ట్రంలో ఏకైక మున్సిపల్ ఛైర్మన్ ను నేనే, నన్ను గెలిపించిన ప్రజల కొరకు ఎన్ని కష్టాలు ఎదురైనా, సేవ చేయడానికి వెనకాడేది లేదని పేర్కొన్నారు. ‌ తాడిపత్రి డిఎస్పీ ఎమ్మెల్యే చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తారని, ఇక్కడికి వచ్చిన పోలీస్ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, నేను నా ఇంటి పరిధిలోనే నిరసన తెలుపుతున్నాను అని జెసి మీడియాతో వ్యాఖ్యలు చేశారు.

 

Tags; JC Prabhakar Reddy who begged

Post Midle
Post Midle