వెంకయ్య నాయుడును కలిసిన జేడీ లక్ష్మీనారాయణ
విశాఖ ముచ్చట్లు:
భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడును సిబిఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ కలిశారు. విశాఖలో శుక్రవారం ఉదయం బీచ్ రోడ్డులో ఇరువురు కలిసి, కాసేపు ముచ్చటించారు. విశాఖ ఉక్కు ఉద్యమంపై తమ కార్యాచరణను జేడీ లక్ష్మీనారాయణ వెంకయ్య నాయుడుకు వివరించారు.
Tags: JD Lakshminarayana met Venkaiah Naidu

